Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే…

Murugesh Nirani a legislator from Bilgi, ఎడ్యూరప్పకు కోపమొచ్చింది.. స్టేజీపైనే…

కర్ణాటక సీఎం ఎడ్యూరప్పకు కోపమొచ్చింది. ఏకంగా ఓ వేదికపైనే ఆగ్రహంగా లేచి వెళ్లి.. లింగాయత్ కులానికి చెందిన ఓ స్వామీజీ మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దావణగేరె లోని హరిహరలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన నిగ్రహాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీలో తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మురుగేష్ నీరానీ అనే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ  వేదికపైనే ఉన్న వచనానందస్వామి కోరడం ఆయన కోపానికి కారణమైంది. ‘ నీరానీని నిర్లక్ష్యం చేయరాదని, అతని గురించి పట్టించుకోకపోతే మా లింగాయత్ ల మద్దతును మీరు కోల్పోతారని ఆ స్వామీజీ హెచ్చరించారు.
దీంతో ఎర్రబడిన ముఖంతో వేదికపైనే విసవిసా నడిచి వఛ్చి.. ఎడ్డీ.. ఆయన కాళ్లకు నమస్కరిస్తూనే.. ఇదంతా వినడానికి తానిక్కడికి రాలేదని, మీ డిమాండ్ల ప్రకారం నడచుకోలేనని.. అంటూ.. ఇక వెళ్ళిపోతా ‘ అంటూ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. అయితే రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై సహా ఇతర సహచరులంతా నచ్చజెప్పడంతో యెడ్యూరప్ప మళ్ళీ తన సీటువద్దకు వెళ్లి కూర్చున్నారు. ఆ తరువాత జరిగిన ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన ఎడ్డీ.. తనను ముఖ్యమంత్రిని చేయడానికి సాయపడి తమ పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయాన్ని తాను చూసుకోవాల్సి ఉందన్నారు.
దయచేసి వచనానందస్వామి వంటివారు తన పరిస్థితిని గమనించాలని,, ఆ రెబల్ ఎమ్మెల్యేలే తనకు సహాయ పడిఉండకపోతే తాను ముఖ్యమంత్రిని అయ్యే వాడినే కానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పదవికి అంటిపెట్టుకుని ఉండాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.. ‘ మీరు కోరితే రేపే రాజీనామా చేస్తా ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా-బిల్గి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురుగేష్ నీరానీ అత్యంత శక్తిమంతమైన లింగాయత్ కులానికి చెందినవారు. వారు తలచుకుంటే కర్ణాటకలో బీజేపీ ఓట్లకే గండి కొట్టగలరు. ఈ నెలాఖరులో ఎడ్డీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.

Related Tags