ప్రైస్ రేసులో ఉల్లికి పోటీగా టమాటా.. కేంద్రం కరుణించేనా..!

ఇప్పటికే ఉల్లి ధర నింగినంటుతూ.. సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంటే.. అటు కూరగాయలు కూడా ఉల్లి ధరతో పోటీ పడుతూ.. సామాన్యులు కొనడానికి భయపడేలా ధరలు మిన్నంటుతున్నాయి. నిత్యం ఉపయోగించే టమాటా కూడా ఇప్పుడు ఉల్లితో పోటీ పడుతుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అన్ని పంటలు నీటమునిగాయి. దీంతో ఒక్కసారిగా కురగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అందులో ముఖ్యంగా టమాటా ఉహించని ధరలను తాకుతోంది. ఢిల్లీలో వీటి ధరదాదాపు 70 శాతం పెరిగింది. […]

ప్రైస్ రేసులో ఉల్లికి పోటీగా టమాటా.. కేంద్రం కరుణించేనా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 27, 2019 | 1:30 PM

ఇప్పటికే ఉల్లి ధర నింగినంటుతూ.. సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంటే.. అటు కూరగాయలు కూడా ఉల్లి ధరతో పోటీ పడుతూ.. సామాన్యులు కొనడానికి భయపడేలా ధరలు మిన్నంటుతున్నాయి. నిత్యం ఉపయోగించే టమాటా కూడా ఇప్పుడు ఉల్లితో పోటీ పడుతుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అన్ని పంటలు నీటమునిగాయి. దీంతో ఒక్కసారిగా కురగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అందులో ముఖ్యంగా టమాటా ఉహించని ధరలను తాకుతోంది. ఢిల్లీలో వీటి ధరదాదాపు 70 శాతం పెరిగింది.

మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఉత్తర భారతంలో కురగాయల ధరలు విపరీంతంగా పెరిగాయి. చాలా చోట్ల సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో.. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ఈ కారణంతో కూరగాయల సరఫరా బాగా పడిపోయింది. దీంతో మార్కెట్లో కూరగాయాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఉల్లిపాయల ధర.. రూ.60 నుంచి 80 పలుకుతూ.. సెంచరీ వైపు చూస్తుంది. ఇటు టమాటలు కూడా రూ. 40 నుంచి 60 పలుకుతోంది. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.40పైగా ఉంది. వీటి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ వ్యాపారస్థులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడుతుండటంతో రైతుల దగ్గరి నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని.. దీంతో అధిక ధరలకు అమ్మాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే హోల్ సేల్ మార్కెట్లో టమాటా కిలో ధర రూ.10 నుంచి 20 ఉండేది. అయితే ఇప్పుడు అది డబుల్ అయ్యింది. ఇప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మార్కెట్‌కి దిగుమతి తగ్గుతోంది. దీని ప్రభావంతో మున్ముందు టమాటా ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..