పంతులమ్మ కోటి రూపాయల కహానీ.. అసలు సంగతేంటంటే.?

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన అనామిక శుక్లా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏకంగా 13 నెలలో కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది...

పంతులమ్మ కోటి రూపాయల కహానీ.. అసలు సంగతేంటంటే.?
Follow us

|

Updated on: Jun 05, 2020 | 5:38 PM

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన అనామిక శుక్లా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏకంగా 13 నెలలో కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల యూపీ విద్యాశాఖ అధికారులు టీచర్ల డేటాబేస్ తయారు చేయగా.. ఆ ఉపాధ్యాయురాలు రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)తో పాటు అమేథి, అంబేద్కర్ నగర్, రాయ్‌బరేలి, ప్రయాగ్‌రాజ్‌, ఆలీగర్ మొదలగు జిల్లాలలోని ఏకంగా 25 పాఠశాలల్లో ఒకేసారి విధులు నిర్వర్తించినట్లు తెలిసి విద్యాశాఖ అధికారులు షాక్ అయ్యారని పలు వార్తలు జాతీయ మీడియాలో రావడంతో యూపీ విద్యాశాఖ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

ఇక ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ జనరల్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ మాట్లాడుతూ ”ఈ ఉదంతంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతవరకు మాత్రం ఎలాంటి నిజ నిర్ధారణ కాలేదు. ఒక ఉపాధ్యాయురాలి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఇప్పుడు పరారిలో ఉంది. రూ .1 కోటి జీతం ఆమెకు చెల్లించినట్లు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటిదేమి ధృవీకరించబడలేదు” అని తెలిపారు.

”ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ ఆరోపణలు నిజమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని.. సదరు ఉపాధ్యాయురాలు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు కూడా బదిలీ కాలేదని తెలుస్తోంది. ఈ విషయంపై డివిజనల్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఏదైనా ఉపాధ్యాయుడు ఇతర పాఠశాలల్లో ప్రాక్సీ టీచర్‌గా పని చేస్తున్నట్లు తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ”అని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!