కోవిడ్-19…ఇండియా ఇంకా రెండో దశలోనే ఉంది.. కేంద్రం క్లారిటీ

కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన లవ్ అగర్వాల్ సోమవారం దీని గురించి […]

కోవిడ్-19...ఇండియా ఇంకా రెండో దశలోనే ఉంది.. కేంద్రం క్లారిటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 6:52 PM

కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన లవ్ అగర్వాల్ సోమవారం దీని గురించి ప్రస్తావిస్తూ.. తాము ఇప్పుడు దీన్ని కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ గా వ్యవహరించడం లేదని, మన దేశం ఇంకా లోకల్ ట్రాన్స్ మిషన్ దశలోనే ఉందని వెల్లడించారు. ‘మేం కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అని వ్యవహరించి ఉంటే అప్పడు వివిధ రకాల ఊహాగానాలకు తావిఛ్చి ఉండేవారం’ అన్నారాయన. లోకల్ వేరు, కమ్యూనిటీ వేరు అని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

లోకల్ అంటే వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే వైరస్.. కానీ కమ్యూనిటీ అంటే జనసమూహాల ద్వారా విచ్ఛలవిడిగా వ్యాపించే కరోనా వైరస్.. ఇదీ ప్రభుత్వ స్పష్టీకరణ.. తొలి దశలో విదేశాలనుంచి తిరిగి వచ్చిన వ్యక్తుల ద్వారా మాత్రమే సోకే వైరస్ కాగా .. రెండో దశలో ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకే వైరస్ అని నిర్ధారించారు. ఉదాహరణకు ఫారిన్ నుంచి వఛ్చినవారు తమ బంధువులకు, వారి సన్నిహితులకు వైరస్ సోకింపజేస్తారని, కానీ లోకల్ ట్రాన్స్ మిషన్ లో తక్కువమంది దీనికి గురవుతారని తేలింది. ఈ వైరస్ మూలం (సోర్స్) ఏమిటో తెలుస్తుందని, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మాదిరి కాకుండా ఈ ‘చైన్’ ని సులభంగా గుర్తించవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. మూడో దశలో ఏ విదేశానికీ వెళ్లకుండానే దేశంలోనే ఉన్నవారికి సోకే వైరస్ అని, ఈ స్టేజీలో ఈ వైరస్ కలిగినవారిని గుర్తించడం దాదాపు అసాధ్యమని వివరించింది. ఎక్కడినుంచి ఇది సోకిందో తెలుసుకోవడం అసాధ్యం.. ఈ దశకు ఇండియా చేరుకుంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం అని నిపుణులు భపడుతున్నారు.

అయితే కరోనా నివారణకు గత మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తోందని వారు భావిస్తున్నారు. గత 6 రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి రెట్టింపు అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని లవ్ అగర్వాల్ తెలిపారు. ఇది లాక్ డౌన్ ఫలితమేనని అభిప్రాయపడ్డారు. మార్చి 22 న 23 రాష్ట్రాల్లోని 75 జిల్లాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడ్డాయని, మార్చి 28 న ఇది 27 రాష్ట్రాల్లోని 160 జిల్లాలకు వ్యాపించిందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అత్యధికంగా 81 కేసులు, కేరళలోని కసర్ గఢ్ లో 78 కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న దశలో 100 కేసులకు, వెయ్యి కేసులకు మధ్య 12 రోజులు పట్టిందని, అయితే ఇతర దేశాల్లో (ఇన్ని రోజుల్లో) 3 వేల నుంచి 5 వేల కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కొంతవరకు మంచి ఫలితాలు సాధించామని, మరో రెండు వారాలు కూడా పాటిస్తే ఇది మంచి పధ్దతి అవుతుందని ఆయన అన్నారు. డిశ్చార్జి అవుతున్న కేసులు కూడా శుభ పరిణామమే అని వ్యాఖ్యానించారు. ప్యానిక్ వద్దు.. ప్రభుత్వ చర్యలకు సహకరిద్దాం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు కూడా వ్యాఖ్యానించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!