Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

కరెంట్ బిల్లు కట్టలేక కటకటా ! స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన

Not able To Even Pay Electricity Bills Says Suresh Babu, కరెంట్ బిల్లు కట్టలేక కటకటా ! స్టార్ ప్రొడ్యూసర్ ఆవేదన

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీసే నిర్మాతలు తగ్గిపోతున్నారని.. అసలు చిన్న సినిమాలకు లైఫ్ లేదని చెబుతున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు. తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాడాయన. వీటన్నిటికీ కారణం అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసులే అంటున్నాడు సురేష్ బాబు.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో కొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు సినిమా విడుద‌లయ్యాక రెండు మూడు నెల‌ల‌కు గానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఆ సినిమాలు టీవీలో ప్రసారం అవ్వడానికి కూడా చాలా నెలలు పట్టేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.. విడుదలైన నెలలోపే ఒరిజినల్ హెచ్ డీ ప్రింట్స్ అందుబాటులోకి వచ్చేయడంతో ప్రేక్షకులు సినిమాహాళ్లకు రావడం మానేసారంటూ ఆయన వాపోయారు.. ఒక రకంగా చూసుకుంటే దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు కూడా లాభాలే ఉంటాయి.. థియెట్రిక‌ల్ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్ల‌తో పాటు ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ కూడా కోట్లు కురిపిస్తున్నాయి. కానీ లాంగ్ రన్ లో మాత్రం దీనివల్ల ఇండస్ట్రీకి నష్టాలు వస్తాయని చెప్పారు.. ఇక డిజిట‌ల్ రైట్స్‌పై తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి ఈ మధ్యే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌ట్నుంచి విడుద‌లైన ప్ర‌తీ సినిమాను కేవ‌లం మూడు నాలుగు వారాల్లోనే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ల‌లో విడుద‌ల చేస్తామంటే కుద‌ర‌దు.. తప్పకుండా 8 వారాలు ర‌న్ ముగిసిన త‌ర్వాతే సినిమా విడుద‌ల చేయాల్సిందిగా షరతును విధించారు.