అమెరికాతో మాత్రమే చర్చలు.. ఉత్తర కొరియా

North Korea threatens to leave South Korea out of U.S. talks

ఉత్తర కొరియా ఎవ్వరి మాట వినేలా లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నాడు ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. ఈ మధ్యనే ఆయుధ పరీక్షలు చేసిన ఉత్తర కొరియా.. మరోసారి పరీక్షలను నిర్వహించింది. శనివారం అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాతో చర్చల ప్రస్తక్తే లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియా ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదిలా ఉంటే శనివారం.. తాము దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు ముగించిన తర్వాత అణు నిరాయుధీకరణపై చర్చించేందుకు కిమ్ ప్రకటన చేశారంటూ ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే ఉత్తర కొరియా ఈ వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *