Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

కిమ్‌ ఇలాకాలో “కరోనా”..! ఊరుకుంటాడా.. దారుణం చేయించేశాడు..

North Korea official suspected of having coronavirus 'shot dead for trip to public baths', కిమ్‌ ఇలాకాలో “కరోనా”..! ఊరుకుంటాడా.. దారుణం చేయించేశాడు..

నార్త్ కొరియా.. పేరు వింటే చాలు.. వెంనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకురాక మానడు. అంతేనా.. అతన్ని చూస్తే చాలు.. ఆ దేశంలో ఉండే కఠినాతికఠిన శిక్షలు గుర్తుకొచ్చేస్తాయి. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 (కరోనా వైరస్) విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు నార్త్ కొరియాలో మానవత్వం అనేది ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. అక్కడ జాలి, దయ అనే పదాలకు తావుండదన్న విషయం కొవిడ్-19 ఘటన విషయంలో తెలుస్తోంది. కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో ఏకంగా ఓ వ్యక్తిని కాల్చేశారు అక్కడి అధికారులు.

ఇక వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాకు చెందిన ఓ అధికారి.. చైనా టూర్‌ ముగించుకుని.. నార్త్ కొరియాకు చేరుకున్నాడు. అయితే చైనా టూర్ నుంచి వచ్చాక అతనికి కరోనా వచ్చిందన్న అనుమానంతో అతడిని బయటికి రావొద్దని కఠిన నిబంధనలు పెట్టారు. అంతేకాదు.. అతనిపై ప్రత్యేక టీం నిఘా కూడా పెట్టింది. అయితే సదరు వ్యక్తి ఆ నిబంధనలు ఉల్లంఘించి ఓ పబ్లిక్ టాయిలెట్ దగ్గర తిరుగుతూ కనిపించాడు. అంతే.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా.. వెంటనే అతడిని సజీవంగా కాల్చిపారేశారు. పైగా.. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు నిస్సిగ్గుగా చెప్తున్నారు. మరొవైపు.. తమ దేశంలో కరోనా బాధితులు ఎవరూ లేరంటూ ఉత్తర కొరియా ప్రకటనలు కూడా చేస్తోంది. ఇక చైనా నుంచి పూర్తిగా రాకపోకలను నియంత్రించింది. అంతేకాదు.. చైనా సరిహద్దులను పూర్తిగా మూసేసింది. ఎవరైనా చైనాకు వెళ్లడానికి ప్రయత్నిస్తే.. వారకి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

Related Tags