మీతో చర్చలు వృధా.. ట్రంప్ కు నార్త్ కొరియా షాకింగ్ రిప్లయ్

  తమ రెండు దేశాలూ సాధ్యమైనంత త్వరగా అణు నిరాయుధీకరణ ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నార్త్ కొరియాకు చేసిన ప్రతిపాదనకు కొరియా ‘ గండి కొట్టింది ‘. ఈ దిశగా ‘ మనం మళ్ళీ సమావేశమవుదాం ‘ అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్ ను ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తేలిగ్గా కొట్టివేసింది. ఈ సమావేశాల పట్ల తమకెంత మాత్రం ఆసక్తి […]

మీతో చర్చలు వృధా.. ట్రంప్ కు నార్త్ కొరియా షాకింగ్ రిప్లయ్
Follow us

|

Updated on: Nov 19, 2019 | 6:32 PM

తమ రెండు దేశాలూ సాధ్యమైనంత త్వరగా అణు నిరాయుధీకరణ ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నార్త్ కొరియాకు చేసిన ప్రతిపాదనకు కొరియా ‘ గండి కొట్టింది ‘. ఈ దిశగా ‘ మనం మళ్ళీ సమావేశమవుదాం ‘ అని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్ ను ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తేలిగ్గా కొట్టివేసింది. ఈ సమావేశాల పట్ల తమకెంత మాత్రం ఆసక్తి లేదని, వీటివల్ల తమకు ప్రయోజనం లేదని ఈ శాఖ సలహాదారు కిమ్ కై గ్వాన్ స్పష్టం చేశారు. మీరు చేసిన ఈ ట్వీట్ పరస్పర అభిమతాన్ని ప్రతిబింబించడంలేదన్నారు. కొరియన్ పీఠభూమికి సంబంధించిన సమస్యలపై చర్చల ద్వారా కొంత ముందడుగు వేద్దామని ట్రంప్ అంటున్నారని , కానీ ఆయన ఉద్దేశాలు మాత్రం దీన్ని మరింత జాప్యం చేయాలన్నట్టు కనిపిస్తోందని కిమ్ విమర్శించారు. ‘ మాకు ప్రతిఫలంగా మీ నుంచి ఏమీ లభించనప్పుడు మీ ఆలోచనలకు మేం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి ‘ అని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది జూన్ నుంచి ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ మధ్య మూడు సార్లు సమావేశాలు జరిగాయి. కానీ వీటివల్ల పెద్దగా ప్రయోజనాలు లేకపోయాయని నార్త్ కొరియా భావిస్తోంది. గత అక్టోబరులో ట్రంప్ తో సమావేశమైనప్పుడు తన స్పెషల్ రిలేషన్ షిప్ గురించి కిమ్ ప్రశంసించగా..దాన్ని గుర్తుంచుకుని ట్రంప్ తాజాగా ఈ ట్వీట్ చేసినట్టు కనిపిస్తోంది. ‘ మేమిద్దరం ఒకరి పట్ల ఒకరం పరస్పర విశ్వాసంతో ఉంటాం ‘ అని కూడా ఆయన పేర్కొన్నప్పటికీ.. ఉత్తర కొరియా మాత్రం ఆయనపై దాదాపు ‘ కారాలు, మిరియాలు నూరుతోంది ‘.