‘మీకు రాయునది ఏమనగా..’ సౌతాఫ్రికా అధ్యక్షునికి కిమ్ లేఖ

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్  అసలు బతికే ఉన్నాడా.. లేక… అంటూ ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే.. ఆయన సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసాకు ఈ నెల 27 న ఒక లేఖ రాశాడట. ఈ లేఖను నార్త్ కొరియా స్టేట్ మీడియా ప్రచురించింది. సౌతాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిల్ కి  కంగ్రాట్స్ చెబుతూ కిమ్ ఈ లేఖ రాసినట్టు మీడియా వెల్లడించింది. దాదాపు పది, పదిహేను రోజులుగా కిమ్ అదృశ్యం మీద రోజుకోరకంగా […]

'మీకు రాయునది ఏమనగా..' సౌతాఫ్రికా అధ్యక్షునికి కిమ్ లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 28, 2020 | 4:41 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్  అసలు బతికే ఉన్నాడా.. లేక… అంటూ ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే.. ఆయన సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసాకు ఈ నెల 27 న ఒక లేఖ రాశాడట. ఈ లేఖను నార్త్ కొరియా స్టేట్ మీడియా ప్రచురించింది. సౌతాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిరిల్ కి  కంగ్రాట్స్ చెబుతూ కిమ్ ఈ లేఖ రాసినట్టు మీడియా వెల్లడించింది. దాదాపు పది, పదిహేను రోజులుగా కిమ్ అదృశ్యం మీద రోజుకోరకంగా వార్తలు వస్తుండగా ఆయన రాసినట్టు చెబుతున్న ఈ లేఖ విషయం చర్చనీయాంశమైంది. ఈ  లెటర్ లో ఆయన.. ఉత్తర కొరియా, దక్షిణాఫ్రికా మధ్య మైత్రి గురించి, ఇది కలకాలం వృద్ది చెందాల్సిన ఆవశ్యకత గురించి పేర్కొన్నాడట.  కిమ్ బతికే ఉన్నాడని, బాగానే ఉన్నాడని దక్షిణ కొరియా అధ్యక్షుని సలహాదారు మూన్ చుంగ్ తెలిపారు. ఈ నెల 13 నుంచి కిమ్ తన దేశ ఈస్ట్ కోస్ట్ లోని వోన్సాన్ ఏరియాలో ఉంటున్నాడని, అక్కడ ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించలేదని ఆయన అన్నారు. వోన్సాన్ కాంప్లెక్స్ లో 9 పెద్ద గెస్ట్ హౌస్ లు, ఓ రిక్రియేషన్ సెంటర్, పోర్టు, షూటింగ్ రేంజ్, రిక్రియేషన్ బిల్డింగ్, హార్స్ రైడింగ్ ట్రాక్ వగైరా హంగులున్నాయి.  కార్డియో వాస్క్యులార్ సర్జరీ అనంతరం కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వార్తలమీద వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ వార్తలను తాను నమ్మబోనని, కిమ్ ఆరోగ్యంగానే ఉండవచ్చునని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.

కిమ్ హ్యాన్గ్ శాన్ కౌంటీలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మెరుగుపడడంతో ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లలో కొందరు ఈ నెల 19 న తిరిగి నార్త్ కొరియా చేరుకున్నారని కూడా సమాచారం. అయితే దీన్ని ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.