కుండపోత వర్షాలు… ఉత్తరాది అతలాకుతలం!

North India reels under landslides, కుండపోత వర్షాలు… ఉత్తరాది అతలాకుతలం!

కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిన హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లను అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో ఆదివారం 28 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది జాడ తెలియరాలేదు. చాలాచోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. పంజాబ్‌లో అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. యమున, సట్లెజ్‌, బియాస్‌ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అవోల్‌లో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇళ్లు, వాహనాలపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. శిమ్లా, సోలన్‌, కులూ, సిర్మౌర్‌, చాంబా ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. శిమ్లా, కులూ, చాంబా జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఉత్తరకాశీ జిల్లా మోరీ సమితిలో కుంభవృష్టి వర్షాలకు చాలాచోట్ల ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో 22మంది గల్లంతయ్యారు. వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరో ముగ్గురు మృతి చెందారు. చార్‌ధామ్‌, కైలాస్‌-మానస సరోవర్‌ మార్గాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *