ఉత్తరాంధ్ర అలెర్ట్ : ఆర్టీజీఎస్ సూచన

ఉత్తరాంధ్రను ఆర్టీజీఎస్ శాఖ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. అలలు నాలుగు మీటర్లకుపైగా ఎత్తుకు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించిన ఆర్టీజీఎస్. గంటలకు 45-55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశముందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆర్జీజీఎస్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలుంటాయన్నారు. నైరుతి రుతుపవనాల గమనం వేగంవంత […]

ఉత్తరాంధ్ర అలెర్ట్ : ఆర్టీజీఎస్ సూచన
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 10:08 AM

ఉత్తరాంధ్రను ఆర్టీజీఎస్ శాఖ అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. అలలు నాలుగు మీటర్లకుపైగా ఎత్తుకు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించిన ఆర్టీజీఎస్. గంటలకు 45-55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశముందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆర్జీజీఎస్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలుంటాయన్నారు. నైరుతి రుతుపవనాల గమనం వేగంవంత కావడంతో సముంద్రంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.