కరోనా ఎఫెక్ట్.. కుదేలైన మాంసం విక్రయాలు..

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ ప్రమాదకర వైరస్ వందల సంఖ్యలో ప్రాణాలు తీసింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ..వణుకుపుట్టిస్తోంది. విరుగుడు మందు లేకపోవడంతో..ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప..రోగాన్ని నివారించడం వీలు కావడం లేదు. అసలు ఈ డేంజరస్ వైరస్ దేని నుంచి వ్యాప్తి చెందింది అనే విషయం క్లారిటీ రావడం లేదు. కొంతమంది పాములు అంటుంటే..మరికొందరు గబ్బిలాలు అంటున్నారు. ఇంకా భిన్నవాదనలు కూడా ఉన్నాయి. కాగా కరోనా […]

కరోనా ఎఫెక్ట్.. కుదేలైన మాంసం విక్రయాలు..
Follow us

|

Updated on: Feb 09, 2020 | 5:30 PM

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ ప్రమాదకర వైరస్ వందల సంఖ్యలో ప్రాణాలు తీసింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ..వణుకుపుట్టిస్తోంది. విరుగుడు మందు లేకపోవడంతో..ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప..రోగాన్ని నివారించడం వీలు కావడం లేదు. అసలు ఈ డేంజరస్ వైరస్ దేని నుంచి వ్యాప్తి చెందింది అనే విషయం క్లారిటీ రావడం లేదు. కొంతమంది పాములు అంటుంటే..మరికొందరు గబ్బిలాలు అంటున్నారు. ఇంకా భిన్నవాదనలు కూడా ఉన్నాయి. కాగా కరోనా ఎఫెక్ట్ భారత్‌లోని నాన్-వెజ్ వ్యాపారాలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మాసం తినేందుకు జనాలు జంకుతున్నారు.

ఒక్కసారిగా అన్ని రకాలు మాంసాలు తినడం ఆపేయడంతో..అమ్మకాలు పూర్తిగా డల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై సర్కులేట్ అవుతోన్న వార్తలు కూడా మాంసం విక్రయాలపై ఎఫెక్ట్ చూపాయి. అసలు సదరు వార్తలు నిజమో, కాదో అన్న విషయం పక్కనబెడితే..కొన్ని రోజులు మాంసం తినకుండా ఉంటే బెటర్ అనుకుంటున్న జనాలు..కనీసం వీకెండ్స్‌లో కూడా చికెన్ షాపులు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో మాంసం విక్రయదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.