బాబు హయాంలోనే అన్యమతస్తులకు ఉద్యోగాలు..

శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఆలయంలో ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. శ్రీశైలం దేవస్థానంలో మొత్తం ముగ్గురు శాశ్వత ఉద్యోగులు,14 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇతర మతాలకు చెందినవారు పనిచేస్తున్నట్లు గుర్తించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే 10 మంది అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని తేలింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌ పద్మకు ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నివేదిక సమర్పించారు. […]

బాబు హయాంలోనే అన్యమతస్తులకు ఉద్యోగాలు..
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 1:05 PM

శ్రీశైలం ఆలయంలో అన్యమతస్తుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఆలయంలో ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. శ్రీశైలం దేవస్థానంలో మొత్తం ముగ్గురు శాశ్వత ఉద్యోగులు,14 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇతర మతాలకు చెందినవారు పనిచేస్తున్నట్లు గుర్తించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే 10 మంది అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని తేలింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌ పద్మకు ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నివేదిక సమర్పించారు. అంతేకాదు 1982 నుంచి దశలవారీగా ఇతర మతాల వారికి ఉద్యోగాలిచ్చినట్లు నివేదికలో తెలిపారు. వీరిలో అత్యధికంగా 1998 నుంచి 2003 మధ్యనే నియమితులయ్యారు. ఇటీవలే దేవస్థానంలో అన్య మతస్తులకు దుకాణాల కేటాయింపుపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వివాదం కారణంగా దుకాణాల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దేవస్థానంలో ఇతర మతాలకు చెందిన ఉద్యోగుల వివరాలపై నివేదిక తయారు చేశారు.