జయప్రదకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

సినీ నటి, బీజేపీ నేత జయప్రదకు యూపీ.. రాంపూర్ లోని కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించింది.

జయప్రదకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 07, 2020 | 12:51 PM

సినీ నటి, బీజేపీ నేత జయప్రదకు యూపీ.. రాంపూర్ లోని కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఆమె ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 20 న జరగాలని కోర్టు ఆదేశించింది. నాడు లోక్ సభ ఎన్నికల సందర్భంగా జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని కేసు నమోదైంది. ఆ ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ ఆమెపై లక్షా పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి  ఆమెను ఓడించారు.