Breaking News
  • ఆస్ట్రేలియాలో ధూళి తుఫాన్‌ బీభత్సం. న్యూసౌత్‌ వేల్స్‌ టౌన్‌లో ధూళి తుఫాన్‌తో పాటు వడగళ్ల వాన. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా. భయంతో పరుగులు తీసిన స్థానికులు.
  • పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు సీతారాం ఏచూరి. ఫిబ్రవరిలో బెంగాల్‌లోని 5 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. కాంగ్రెస్‌ సహకారంతో ఏచూరిని రాజ్యసభకు పంపాలని సీపీఎం నిర్ణయం.
  • తమ ర్యాంకులను పటిష్టం చేసుకున్న కోహ్లీ, రోహిత్‌. 886 పాయింట్లతో నెం.1 ర్యాంకులో ఉన్న కోహ్లీ. 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన రోహిత్‌ శర్మ. మూడో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజామ్‌.
  • మాల్దీవుల ప్రాంతంలో బలహీనపడ్డ ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులు. తెలంగాణలో క్రమంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.
  • కేరళ వెళ్లిన తెలంగాణ అధికారులు. నేడు కేరళ ఉన్నతాధికారులతో భేటీకానున్న తెలంగాణ అధికారులు. కేరళ ప్రవాస సంక్షేమ విధానాలపై అధ్యయనం చేయనున్న అధికారులు.

కరుణానిధి మనవరాలికి నాన్‌బెయిలబుల్ వారెంట్

, కరుణానిధి మనవరాలికి నాన్‌బెయిలబుల్ వారెంట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వికి కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయలేదన్న ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయలేదు. దాదాపు 70లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. దానికి ఆమె స్పందించకపోవడంతో పాటు డబ్బు కూడా చెల్లించకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు అంజుగ సెల్వి అరెస్ట్‌కు ఆదేశాలిచ్చింది.