గ్రేటర్ హైదరాబాద్‌లో మొదలైన నామినేషన్ల పర్వం.. తొలి రోజు 20 నామినేషన్లు దాఖలు

First day of the nominations : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి రెండు నామినేషన్లు, కాంగ్రెస్‌ నుంచి మూడు, టీడీపీ నుంచి ఐదు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మూడు, గుర్తింపు పొందిన పార్టీ నుంచి మరో నామినేషన్‌ దాఖలయ్యాయి. బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం […]

  • Sanjay Kasula
  • Publish Date - 9:27 pm, Wed, 18 November 20

First day of the nominations : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి రెండు నామినేషన్లు, కాంగ్రెస్‌ నుంచి మూడు, టీడీపీ నుంచి ఐదు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మూడు, గుర్తింపు పొందిన పార్టీ నుంచి మరో నామినేషన్‌ దాఖలయ్యాయి.

బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నామినేషన్ల సమర్పణకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందున రేపు, ఎల్లుండి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లోకిఅనుమతి ఇస్తున్నారు. నామినేషన్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల 20వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 1న పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలోని ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.