పదవులు దక్కినా..దక్కకున్నా.. అసంతృప్తే.. కారణమేంటంటే ?

టిఆర్ఎస్‌ పార్టీలో నామినేటెడ్ పదవుల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఆశిస్తున్న పదవులు కాకుండా వేరే పదవులు వచ్చినందుకు సంతోష పడాలో..బాధపడాలో తెలియక కొందరు నేతలు సతమతమవుతుంటే.. కోరుకున్న పదవిని వేరేవారు కొట్టుకుపోవడంతో మధన పడుతున్న నాయకులు మరికొందరు కనిపిస్తున్నారు. ఎటొచ్చి పదవులు దక్కిన వారు.. దక్కని వారు.. ఇద్దరూ ఎంతో కొంత అసంత‌ృప్తితో రగిలిపోతున్న విచిత్ర పరిస్థితి అధికార టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి […]

పదవులు దక్కినా..దక్కకున్నా.. అసంతృప్తే.. కారణమేంటంటే ?
Follow us

|

Updated on: Nov 19, 2019 | 2:25 PM

టిఆర్ఎస్‌ పార్టీలో నామినేటెడ్ పదవుల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఆశిస్తున్న పదవులు కాకుండా వేరే పదవులు వచ్చినందుకు సంతోష పడాలో..బాధపడాలో తెలియక కొందరు నేతలు సతమతమవుతుంటే.. కోరుకున్న పదవిని వేరేవారు కొట్టుకుపోవడంతో మధన పడుతున్న నాయకులు మరికొందరు కనిపిస్తున్నారు. ఎటొచ్చి పదవులు దక్కిన వారు.. దక్కని వారు.. ఇద్దరూ ఎంతో కొంత అసంత‌ృప్తితో రగిలిపోతున్న విచిత్ర పరిస్థితి అధికార టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాక ముందే రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవిపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ పదవి కోసం ప్రయత్నించారు.

ఇందులో సురేశ్‌రెడ్డికి ఆ పోస్టు ఇవ్వడం కుదరదు అని ముందే చెప్పిన టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం.. బాజిరెడ్డి గోవర్ధన్‌కు మాత్రం భరోసా ఇచ్చింది. దీంతో బాజిరెడ్డి ఆ పోస్టు తనకే అని ఫిక్స్ అయ్యారట. కానీ ఇక్కడే సీన్‌ రివర్స్‌ అయింది. ఊహించని విధంగా నల్గొండ జిల్లా నేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కట్టబెట్టారు గులాబీ బిగ్ బాస్.

అయితే ఇక్కడే మళ్లీ కొత్త ట్విస్ట్‌ తలెత్తినట్లు సమాచారం. పల్లా కూడా ఈ పదవి కోరుకోలేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. లేట్ అయినా సరే మంత్రి పదవినే ఆయన ఆశించారని సమాచారం. ఎందుకంటే మంత్రి రేస్‌లో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా శాసన మండలి ఛైర్మన్ అవడంతో తనకు లైన్ క్లియర్ అయ్యిందని పల్లా భావించారట. కానీ కేసీఆర్ రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఇప్పుడు ఆయన ఆశలు కూడా గల్లంతయ్యాయని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు సమాచారం.

ఇక వస్తుంది అనుకున్న పదవి రాకపోవడంతో అటు ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆ పదవి తనకే వస్తుందని అనుచరులకు, సన్నిహితులకు చెప్పుకున్న బాజిరెడ్డి ఆ పదవికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. మరి ఇప్పుడు సీన్‌ రివర్స్ అవ్వడంతో లోలోపల నలిగిపోతున్నారని తెలుస్తోంది.

అటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా అసంతృప్తి గానే ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నేతలు కోరుకున్న పదవి నల్గొండ జిల్లా నేతలకు దక్కడం కూడా చర్చగా మారింది. ఎందుకంటే గత అధ్యక్షుడు, ప్రస్తుతం పదవి దక్కిన నేత కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం కూడా చర్చనీయాంశమైనట్లు తెలుస్తోంది. అయితే ఇంత చర్చ జరుగుతున్నా.. అధిష్టానం ఏ మాత్రం పట్టనట్లు వుందని తెలుస్తోంది. అంతా సర్దుకుంటుందన్న విశ్వాసంలో అధినాయకత్వం వున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.