నోకియా 2.4 స్మార్ట్ ఫోన్ విడుదల… సింగిల్ ఛార్జ్ తో రెండు రోజుల బ్యాటరీ… ధర రూ. పదివేలే…

ఫిన్‌లాండ్‌కు చెందిన‌ నోకియా సంస్థ భారతదేశంలో నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త నోకియా ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. సింగిల్ ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

నోకియా 2.4 స్మార్ట్ ఫోన్ విడుదల... సింగిల్ ఛార్జ్ తో రెండు రోజుల బ్యాటరీ... ధర రూ. పదివేలే...
Follow us

|

Updated on: Nov 27, 2020 | 3:31 PM

ఫిన్‌లాండ్‌కు చెందిన‌ నోకియా సంస్థ భారతదేశంలో నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త నోకియా ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. సింగిల్ ఛార్జీతో రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

భారతదేశంలో నోకియా 2.4 ధర ఇదే…

భారతదేశంలో నోకియా 2.4 మోడ‌ల్‌లో ప్ర‌స్తుతానికి 3 జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్‌ను మాత్ర‌మే విడుద‌ల చేయ‌గా దీని ధ‌ర 10,399 రూపాయలుగా నిర్ణ‌యించారు. ఫోన్ చార్‌కోల్, డస్క్ , ఫ్జోర్డ్ కలర్ ఆప్షన్లలో వస్తోంది. నోకియా ఇండియా వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేకంగా ప్రీ-ఆర్డర్ చేసుకోవ‌చ్చు. ఇది డిసెంబ‌రు 4 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

రానున్న రోజుల్లో మరింత అప్ గ్రేడ్…

నోకియా 2.4 ఆండ్రాయిడ్ 10 లో నడుస్తుంది.. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12 తో సహా రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లను అందుకుంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ ఫోన్ ఆరున్నర అంగుళాల హెచ్‌డీ డిస్ప్లేతో వస్తోంది. నోకియా 2.4 లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెస‌ర్ ను వినియోగించారు. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమోరీ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమోరీని 512జీబీ వరకు పెంచుకోవ‌చ్చు. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 2.2 లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది, ఎఫ్ / 2.4 లెన్స్ ఉంటుంది. ఇక క‌నెక్టివిటీ విష‌యానికొస్తే 4G లైట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో-యుఎస్బి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్‌తో పాటు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది. నోకియా 2.4 వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ అలాగే ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది ఒకే ఛార్జీపై రెండు రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ లైఫ్ ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది.

నోకియా 2.4 మోడ‌ల్‌పై ఆఫ‌ర్లు..

ఆఫర్ల విషయానికొస్తే, నోకియా ఇండియా వెబ్‌సైట్ ద్వారా నోకియా 2.4 ను ఆర్డర్ చేసిన మొదటి 100 కస్టమర్లు డిసెంబర్ 4 రాత్రి 11:59 గంటల వరకు 007 స్పెషల్ ఎడిషన్ బాటిల్, క్యాప్, మెటల్ కీచైన్‌లతో కూడిన 007 మర్చండైజ్ హంపర్‌ను పొంద‌వ‌చ్చు. అలాగే జియో కూడా ప‌లు ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ. 3,550. విలువైన ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తోంది. రూ. 2,000 ప్రీపెయిడ్ రీఛార్జిపై వీటిలో తక్షణ క్యాష్‌బ్యాక్ రూ. 349 ల‌భిస్తుంది. మరియు ఇత‌ర‌ భాగస్వాముల నుండి 1,550 విలువైన వోచర్లను పొంద‌వ‌చ్చు.

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా