నోకియా నుంచి నూతన ఉత్పత్తులు… మార్కెట్లోకి ల్యాప్ టాప్స్, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్ టాప్ కూడా…

స్మార్ట్ ఫోన్ కంపెనీ దిగ్గ‌జం నోకియా భారతదేశంలో కొత్త‌గా ల్యాప్‌టాప్‌లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను రూపొందిస్తోంది.

నోకియా నుంచి నూతన ఉత్పత్తులు... మార్కెట్లోకి ల్యాప్ టాప్స్, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్ టాప్ కూడా...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 6:42 PM

స్మార్ట్ ఫోన్ కంపెనీ దిగ్గ‌జం నోకియా భారతదేశంలో కొత్త‌గా ల్యాప్‌టాప్‌లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను రూపొందిస్తోంది. 2009 నోకియా బ్రాండ్ నుంచి చివ‌రిసారి నోకియా బుక్‌లెట్ 3 జీ, మినీ ల్యాప్‌టాప్ ను ప్రవేశ పెట్టింది. అప్ప‌టి నుంచి చాలా ఏళ్ల త‌రువాత ఇండియాలో మ‌ళ్లీ త‌న కంప్యూట‌ర్ సెగ్మెంట్‌ను పునరుద్ధరించాలని చూస్తోంది. కాగా ఇటీవ‌ల నోకియా ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడ్డాయి.

బీఐఎస్ వెబ్‌సైట్‌లో వివ‌రాలు…

బీఐఎస్ వెబ్‌సైట్‌లోని సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలోకి వస్తాయి. ఈ మోడళ్లకు మోడల్ సంఖ్యలు NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S. బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్ ప్ర‌కారం చూస్తే ఇందులో కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్‌లు ఉండొచ్చు. నాలుగు కోర్ ఐ 3 చిప్‌సెట్లతో న‌డుస్తాయి. ఈ పేర్ల‌లో ఎన్‌కే అక్ష‌రాల త‌రువాత ప‌రిశీలిస్తే ఈ ప్రాసెస‌ర్ల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఈ పేర్లలో యుఎల్‌కు ముందు 10వ సంఖ్య ఉంది కాబ‌ట్టి ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10 లో నడుస్తాయ‌ని తెలుస్తోంది. నోకియా ల్యాప్‌టాప్‌లను బీఐఎస్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం చైనా కంపెనీ టోంగ్‌ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసిన‌ట్లు తెలుస్తోంది. నోకియా అధికారిక లైసెన్స్‌డ్ సంస్థ హెచ్ ఎండీ గ్లోబల్ వీటిని త‌యారు చేయ‌లేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, మొబైల్ ఉపకరణాల కోసం మాత్ర‌మే నోకియా బ్రాండ్‌కు హెచ్‌ఎండీ గ్లోబల్ లైసెన్స్ ఇచ్చింది. స్ట్రీమింగ్ పరికరాలు, టెలివిజన్లు, ల్యాప్ టాప్‌లకు వేరే లైసెన్స్ హోల్డర్ ఉంది.

ఫ్లిప్ కార్ట్తో ఒప్పందం…

భారతదేశంలో నోకియా తన స్మార్ట్ టెలివిజన్లను ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని విక్రయిస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌ల విషయంలో కూడా కావచ్చు. అదే నిజమైతే, నోకియా ల్యాప్‌టాప్‌లు కేవ‌లం ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నుంది. ఇండియాలో నోకియా టెలివిజన్లు స్ట్రీమింగ్ పరికరాల మాదిరిగానే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉండొచ్చు. అయితే నోకియా దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు

నోకియా లాప్‌టాప్‌ల‌ను పరిశీలిస్తే, రూ .40,000 ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. వినియోగ‌దారుల నుంచి నోకియా ల్యాప్‌టాప్‌లకు మంచి డిమాండ్ ఏర్ప‌డ‌నుంది. ప్రస్తుతం మార్కెట్ ఇప్పటికే అవిటా, ఆసుస్, హెచ్‌పీ, ఎసర్‌తో సహా వివిధ బ్రాండ్ల నుంచి చాలా ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి పోటీ త‌ట్ట‌కోవాలంటే ఆధునిక ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌ల్లో లాప్‌టాప్‌ల‌ను నోకియా తీసుకురావాల్సి ఉంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.