కనెక్టింగ్ పీపుల్.. రంగంలోకి మళ్ళీ నోకియా

ఒకప్పడు మొబైల్ హ్యాండ్‌సెట్‌ల రంగంలో అగ్రగామిగా వెలుగొంది.. ఆ తర్వాత ఒక్కసారిగా అంతర్ధానమై పోయిన నోకియా కంపెనీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ లక్ష్యంతో దూసుకొస్తోంది. ఇందుకోసం మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ఎయిర్‌టెల్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

కనెక్టింగ్ పీపుల్.. రంగంలోకి మళ్ళీ నోకియా
Follow us

|

Updated on: Apr 28, 2020 | 3:25 PM

ఒకప్పడు మొబైల్ హ్యాండ్‌సెట్‌ల రంగంలో అగ్రగామిగా వెలుగొంది.. ఆ తర్వాత ఒక్కసారిగా అంతర్ధానమై పోయిన నోకియా కంపెనీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ లక్ష్యంతో దూసుకొస్తోంది. ఇందుకోసం మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ఎయిర్‌టెల్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశ మార్కెట్లో కోల్పోయిన ఒకప్పటి ఉన్నత స్థానాన్ని తిరిగి పొందేందుకు నోకియా ప్రయత్నాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఎయిర్‌టెల్ సంస్థతో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఎయిర్‌టెల్ వంటి అగ్రగామి మొబైల్ ఆపరేటింగ్ సంస్థతో 1 బిలియ‌న్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకున్నట్లు ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నోకియా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా దేశంలో వినియోగదారులకు 4జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచి.. అత్యున్నత వేగంతో 5జీ ఇంటర్నెట్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు.

2022 సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 3 ల‌క్ష‌ల కొత్త మొబైల్ ట‌వ‌ర్ల‌ను నెలకొల్పడమే ల‌క్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌లు క‌లిసి ప‌నిచేయ‌నున్నామని నోకియా ప్రతినిధులు ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న 4జీ నెట్‌వర్క్‌ను మరింత వేగవంతం చేయడంతో పాటు, కొత్తగా 5జీ ఇంటర్నెట్‌ను వినియోగదారులకు అందించేందుకు దేశంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు ఉన్న 9 మొబైల్ సర్కిళ్లకు ఈ తాజా ఒప్పందం వర్తిస్తుందని వారు వివరించారు.

అతిపెద్ద టెలికాం మార్కెట్లలో కనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని, భారతదేశంలో తన స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీజీవో ప్రకటించారు. సుమారు 135 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అ టెలికాం మార్కెట్ అయిన భారతదేశంలో మునుముందు పెరగనున్న ఆన్‌లైన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం చేసుకున్నట్లు నోకియా ప్రతినిధులు, ఎయిర్‌టెల్ బృందం వెల్లడించింది.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్