నోకియా 7.2 అదుర్స్‌..

nokia 7.2 goes on sale price in india offers and specifications, నోకియా 7.2 అదుర్స్‌..

హెచ్ఎండీ గ్లోబల్‌ నుంచి ఇటీవల విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో సేల్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 7.2 పేరుతో గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్యూర్‌ డిస్‌ప్లే వంటి బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి.నోకియా 7.2 4జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.18,599 కాగా, టాప్ ఎండ్ మోడల్ అయిన 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,599. ఫ్లిప్‌కార్ట్, నోకియా వెబ్‌సైట్ సహా రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది.  ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.7200 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.ఇక నోకియా 7.2 స్పెసిఫికేషన్లు:6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ పై ఓఎస్, భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 10కి అప్‌గ్రేడ్ అవకాశం, స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబీ/6జీ మోడళ్లు, 48 ఎంపీ+5 ఎంపీ+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *