Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • ప్రధానితో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కీలక చర్చ. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రులు అభిప్రాయాలను ప్రధానితో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

అద్భుతమైన ఫీచర్లతో నోకియా 6.2… ధర ఎంతంటే?

Nokia 6.2 launched in India Specs price and other details, అద్భుతమైన ఫీచర్లతో నోకియా 6.2… ధర ఎంతంటే?

అద్భుతమైన ఫీచర్లతో నోకియా  6.2 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. నిజానికి ఈ ఫోన్ ను గత నెలలో బెర్లిన్ లో జరిగిన ఐఎఫ్ఏ 2019లోనే లాంచ్ చేసినా, మన దేశానికి మాత్రం శుక్రవారమే వచ్చింది. నోకియా 6.2 ధరను భారతదేశంలో రూ.15,999గా నిర్ణయించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, నోకియా అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆఫ్ లైన్ మొబైల్ స్టోర్లలో కూడా నేటి నుంచే విక్రయం ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి సెరామిక్ బ్లాక్ కలర్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఐస్ కలర్ వేరియంట్ కూడా విడుదల కానుంది.

అమెజాన్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ద్వారా మరో రూ.10,100 వరకు తగ్గింపు పొందవచ్చు. నోకియా వెబ్ సైట్ లో నవంబర్ 30 లోపు ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారికి రూ.1,500 విలువ చేసే వోచర్ లభించనుంది. ఆఫ్ లైన్ కస్టమర్లకు కూడా పలు అదనపు లాభాలు లభించనున్నాయి. ఇందులో రూ.7,200 వరకు జియో నుంచి లభించే లాభాలు కూడా ఉన్నాయి.

ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ డిస్ ప్లే హెచ్డీఆర్ 10ను సపోర్ట్ చేస్తుంది. దీనికి రక్షణగా గొరిల్లా గ్లాస్ 3ని అందించారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే… ఇందులో ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ ను ఉపయోగించారు. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్ గా ఉంది. దీనికి వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ కాగా, దీని అపెర్చర్ f/1.8గా ఉంది. 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ కెమెరాను, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. వీటి అపెర్చర్ f/2.2గా ఉంది. అపెర్చర్ f/2.0గా ఉన్న 8 మెగా పిక్సెల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించారు.

Related Tags