ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ.. రిపబ్లిక్ డే పరేడ్‌ను అడ్డుకోం.. రైతు సంఘాల ప్రకటన…

ఈ నెల 26 న  గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాలు ప్రకటించాయి

ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ.. రిపబ్లిక్ డే పరేడ్‌ను అడ్డుకోం.. రైతు సంఘాల ప్రకటన...
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2021 | 3:00 PM

ఈ నెల 26 న  గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాలు ప్రకటించాయి. ఆ రోజున జరిగే పరేడ్, ఇతర కార్యక్రమాలను తాము భంగపరచబోమని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు తెలిపారు. అయితే ఈ మార్చ్ ను అడ్డుకోవడానికి కొన్ని వేర్పాటువాద శక్తులు చేస్తున్న ప్రయత్నాన్ని నీరుగార్చాలని, వారితో చేతులు కలపరాదని ఈ నాయకుల్లో ఒకరైన బల్బీర్ సింగ్ అన్నదాతలకు రాసిన బహిరంగ లేఖలో కోరారు.  మరోవైపు ..గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రైతులంతా తమ ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతు చట్టాలకు  తామంతా వ్యతిరేకమని మళ్ళీ కేంద్రానికి చాటి చెప్పాలని కోరింది.

అటు-26 న రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలను భంగపరచేందుకు ట్రాక్టర్ మార్చ్ గానీ, మరే ఇతర నిరసన గానీ జరగకుండా చూడాలని కేంద్రం సుప్రీంకోర్టులో ఇంజంక్షన్ దాఖలు చేసింది. దీన్ని విచారించేందుకు కోర్టు అంగీకరించింది