హనీమూన్‌కు వెళ్లే టైమ్ కూడా లేదు : నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ఏప్రిల్ 16న యంగ్ హీరో ఏడడుగులు వేయబోతున్నాడు.  అయితే తనకు పెళ్లి పనులు చూసుకునే తీరిక కూడా లేదంటున్నాడు నిఖిల్. ‘కార్తికేయ 2’ మూవీ దసరాకి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవ్వడంతో..అస్సలు తీరిక ఉండటంలేదని చెప్తున్నాడు. అలాగే మూవీ కంప్లీట్ అయ్యేవరకు హనీమూన్‌కి కూడా వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడట. పెళ్లి కోసం కూడా షూటింగ్ నుంచి జస్ట్ వీక్ ఆఫ్ […]

హనీమూన్‌కు వెళ్లే టైమ్ కూడా లేదు  : నిఖిల్
Follow us

|

Updated on: Mar 11, 2020 | 10:40 AM

యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ఏప్రిల్ 16న యంగ్ హీరో ఏడడుగులు వేయబోతున్నాడు.  అయితే తనకు పెళ్లి పనులు చూసుకునే తీరిక కూడా లేదంటున్నాడు నిఖిల్. ‘కార్తికేయ 2’ మూవీ దసరాకి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవ్వడంతో..అస్సలు తీరిక ఉండటంలేదని చెప్తున్నాడు. అలాగే మూవీ కంప్లీట్ అయ్యేవరకు హనీమూన్‌కి కూడా వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడట. పెళ్లి కోసం కూడా షూటింగ్ నుంచి జస్ట్ వీక్ ఆఫ్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు.

‘కార్తికేయ’ మూవీ రిలీజై 6 ఏళ్లు అయినా ప్రేక్షకులు ఆ సినిమాను మర్చిపోలేదని.. అందుకే ‘కార్తికేయ 2’ కాన్సెప్ట్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని తెలిపాడు. ‘కార్తికేయ’ లో చెప్పినట్టే సీక్వెల్‌లో కూడా  “దేవుడు మనిషి రూపంలో బతికే ఉంటాడని చూపించబోతున్నాం’’ అని నిఖిల్ చెప్పుకొచ్చాడు. పురాణాలకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ సినిమాని రూపొందిస్తున్నట్టు నిఖిల్ తెలిపాడు.