తృటిలో గండం తప్పింది.. కమల్ నాథ్ ప్రభుత్వం సేఫ్

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి తృటిలో గండం తప్పింది. తన సర్కార్ ని కూల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని ఆయన  వమ్ము చేయగలిగారు.

తృటిలో గండం తప్పింది.. కమల్ నాథ్ ప్రభుత్వం సేఫ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 05, 2020 | 11:11 AM

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి తృటిలో గండం తప్పింది. తన సర్కార్ ని కూల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాన్ని ఆయన  వమ్ము చేయగలిగారు. తన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకున్నారు. గుర్ గావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ శాసన సభ్యులను బీజేపీ నేతలు బలవంతంగా దాదాపు బందీలుగా చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు ఈ హోటల్ వద్ద హైడ్రామా నడించింది.

మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు రాష్ట్ర మంత్రులు.. ఆ హోటల్లో ‘బందీలుగా’ ఉన్న బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యే రమాబాయిని, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేని ‘రక్షించి ‘బయటకు తీసుకువచ్చారు. ఆ సందర్భంలో రమాబాయిపై దాడి జరిగినట్టు తెలిసింది. కాగా మొత్తానికి బుధవారానికి సాయంత్రం సీన్ మారిపోయింది. హోటల్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు నేరుగా సీఎం కమల్ నాథ్ నివాసానికి చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేల్లో ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. చివరకు కాంగ్రెస్ శాసన సభ్యులతో బేరసారాలాడి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ ప్లాన్ బెడిసికొట్టింది.  కమలం పార్టీకి   చెందిన శరద్ కోల్, నారాయణ్ త్రివేదీ అనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. నలుగురు ఇండిపెండెంట్లు, బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలకు చెందిన శాసన సభ్యుల సపోర్టుతో కమల్ నాథ్ ప్రభుత్వం పూర్తి మెజారిటీని సంతరించుకుని ‘బీజేపీ గండం’ నుంచి బయటపడింది.