ఔను వాళ్ళిద్దరు మాట్లాడుకోరు..కానీ ఓకే పార్టీలో..!

ఆ ఇద్దరిది ఒకే పార్టీ. పైగా ఒకే నియోజకవర్గం. ఒకే సామాజికవర్గం. వారిలో ఒకరు మంత్రి. మరొకరు డబుల్‌ హాట్రిక్‌ విక్టరీ సాధించిన సీనియర్‌ ఎమ్మెల్యే. ఒకప్పుడు సై అంటే సై అనుకున్న ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఎదురుపడితే కనీసం పలకరించు కోలేని పరిస్థితి. ఈ సీన్ చూసిన అధికార పార్టీ నేతలు నివ్వెర పోవడం మినహా ఏమీ చేయలేక, గుసగుసలాడుకునేందుకే పరిమితమవుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే […]

ఔను వాళ్ళిద్దరు మాట్లాడుకోరు..కానీ ఓకే పార్టీలో..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 19, 2019 | 12:44 PM

ఆ ఇద్దరిది ఒకే పార్టీ. పైగా ఒకే నియోజకవర్గం. ఒకే సామాజికవర్గం. వారిలో ఒకరు మంత్రి. మరొకరు డబుల్‌ హాట్రిక్‌ విక్టరీ సాధించిన సీనియర్‌ ఎమ్మెల్యే. ఒకప్పుడు సై అంటే సై అనుకున్న ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఎదురుపడితే కనీసం పలకరించు కోలేని పరిస్థితి. ఈ సీన్ చూసిన అధికార పార్టీ నేతలు నివ్వెర పోవడం మినహా ఏమీ చేయలేక, గుసగుసలాడుకునేందుకే పరిమితమవుతున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సీనియర్‌ లీడర్‌ రెడ్యానాయక్‌. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన నేత. ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఒకే సామాజికవర్గం…ఒకే నియోజకవర్గం కావడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ లెవల్లో సాగుతోంది.

ఎమ్మెల్యే కూతురు కవిత కూడా ఎంపీ. పైకి చూస్తే నియోజకవర్గంలో అంతా బాగానే కనిపిస్తోంది. కానీ ఈగో ఫీలింగ్‌ అసలు సమస్యగా మారింది. రాజకీయాల్లో తన జూనియర్‌, తన చేతిలో ఎమ్మెల్యేగా ఓడిన నేత మంత్రి కావడం ఆ సీనియర్‌ ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదు. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల సన్నిహితులు, పార్టీ సీనియర్ల దగ్గర తన ఆవేదన పంచుకుంటున్నారు. కానీ తన జూనియర్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఇటీవల కార్తీక పౌర్ణమి జరిగిన సంఘటన ఇందుకు లేటెస్ట్‌ ఎగ్జాంపుల్ అని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

మంత్రి, ఎమ్మెల్యే ఎదురుపడినా కనీసం పలకరించుకోకుండా వెళుతున్నారు. ఇటీవలే జిల్లాలో కురవి మండలం కందికొండలో జాతర జరిగింది. కందగిరి పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి జాతరకు మంత్రి సత్యవతి రాథోడ్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అంగోతు బిందు కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. అప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఆయన కూతురు కవిత మంత్రికి ఎదురుపడ్డారు. కానీ ఈ నేతలు కనీసం పలకరించుకోకపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆలయంలో ఇలా జరిగితే… బయట కూడా అదే సీన్‌ రిపీట్‌ అయింది. మంత్రి మీడియా సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీ డుమ్మా కొట్టారు. అదే ప్లేస్‌లో ఆ తర్వాత ప్రత్యేకంగా వారిద్దరు ప్రెస్‌మీట్‌ పెట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మంత్రి పదవి దక్కకపోవడం…సత్యవతికి మంత్రి పదవి ఇవ్వడంతో రెడ్యానాయక్‌ ముఖం చాటేస్తున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ వర్గ పోరులో నలిగిపోతున్నామని పార్టీ కార్యకర్తలు వాపోతున్నాయి.