రాహుల్ గాంధీ పేరు మార్చుకుంటాడట..

రాహుల్ గాంధీ పేరు మార్చుకుంటాడట.. అవును మీరు విన్నది నిజమే.. రాహుల్ గాంధీ పేరుతో అతనికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఆ పేరు ఎవరికి చెప్పినా.. అతన్ని వింతగా చూస్తున్నారట. సిమ్ కార్డు తీసుకోడానికి వెళ్తే అనుమానంగా చూస్తున్నారట. చివరకు ఎవరికైనా ఫోన్ చేసి.. తన అసలు పేరు చెప్తే చాలు.. వెంటనే ఫోన్ పెట్టేస్తున్నారట. ఇంతకీ ఎందుకు అలా జరుగుతోంది. ఎంటో చూద్దామా.. సహజంగా సినిమా హీరోలను, రాజకీయ నాయకులను అమితంగా ఇష్టపడే తల్లిదండ్రులు.. వారి […]

రాహుల్ గాంధీ పేరు మార్చుకుంటాడట..
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 8:32 PM

రాహుల్ గాంధీ పేరు మార్చుకుంటాడట.. అవును మీరు విన్నది నిజమే.. రాహుల్ గాంధీ పేరుతో అతనికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఆ పేరు ఎవరికి చెప్పినా.. అతన్ని వింతగా చూస్తున్నారట. సిమ్ కార్డు తీసుకోడానికి వెళ్తే అనుమానంగా చూస్తున్నారట. చివరకు ఎవరికైనా ఫోన్ చేసి.. తన అసలు పేరు చెప్తే చాలు.. వెంటనే ఫోన్ పెట్టేస్తున్నారట. ఇంతకీ ఎందుకు అలా జరుగుతోంది. ఎంటో చూద్దామా..

సహజంగా సినిమా హీరోలను, రాజకీయ నాయకులను అమితంగా ఇష్టపడే తల్లిదండ్రులు.. వారి పేర్లను తమ పిల్లలకు పెడుతూ ఉంటారు. అలా పెడితే వారిలా పైకి వస్తారన్న ఆశతో అలా చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, శ్రీకాంత్, నాగార్జున, రజినీకాంత్ పేర్లు ఎంతమందికి ఉన్నాయో లెక్కేలేదు. ఇక ఈ మధ్య రాజకీయ నాయకుల పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతో కూడా ఓ సామాన్య వ్యక్తి ఉన్నారు. ఇలా సెలబ్రెటీల పేర్లు మనకు ఉండటం కొన్ని సార్లు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినప్పటికీ.. మరికొన్ని సార్లు ఇబ్బందులు కూడా తప్పవు. అక్షరాల అది నిజమే అని రుజువైందంటున్నారు మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందని రాహుల్ గాంధీ అనే వ్యక్తి.

ఇండోర్‌కు 22ఏళ్ల ఓ వ్యక్తి పేరు రాహుల్ గాంధీ. అచ్చంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేరే. ఇంటి పేరు కూడా ఒకటే. అయితే దీనివల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఇండోర్ రాహుల్ వాపోతున్నాడు. తనకు గుర్తింపు కార్డు ఒక్క ఆధార్‌ కార్డ్‌ మాత్రమే ఉందని..ఇంకా ఎలాంటి గుర్తింపు కార్డు లేదని తెలుపుతున్నాడు. తనని అంతా నకిలీ వ్యక్తిగా అనుకుంటున్నారని మొరపెట్టుకుంటున్నాడు. నా పేరు చెప్పగానే అనుమానంగా చూస్తున్నారని ఇండోర్ రాహుల్ అంటున్నాడు.

వాస్తవానికి ఈ ఇండోర్ రాహుల్ అసలు పేరు రాహుల్ మాలవీయ. అయితే తన తండ్రి రాజేష్ మాలవీయ పార్లమెంటరీ ఫోర్స్‌లో పనిచేసేవారు. అప్పుడు అక్కడి అధికారులంతా అతన్ని గాంధీ అని పిలిచేవారట. అయితే అదే పేరు కొనసాగుతూ రావడంతో.. అదే అతని ఇంటి పేరుగా మారిందని ఇండోర్ రాహుల్ చెప్పుకొచ్చాడు. దీంతో అలా అతని ఇంటిపేరు గాంధీ అయ్యిందని.. స్కూల్లో కూడా రాహుల్ గాంధీ అని నమోదు చేశారని తెలిపాడు. అయితే ఇప్పుడు అదే పేరు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నాడు. ఇప్పుడు ఇక ఈ పేరు చివరన ఉన్న గాంధీని తొలగించుకుంటానంటున్నాడు రాహుల్ గాంధీ. సారీ ఇండోర్‌కు చెందని అసలు రాహుల్ గాంధీ.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..