Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

నాకు శాలువలు వద్దు.. పుస్తకాలు బెటర్ : కిషన్ రెడ్డి

Kishan Reddy, నాకు శాలువలు వద్దు.. పుస్తకాలు బెటర్ : కిషన్ రెడ్డి

బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానమున్న ఆయన మరింత వినూత్నంగా ఆలోచించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఇటీవలే గెలుపొందిన ఆయన.. తనను అభినందించేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ కొత్త సూచన చేశారు. శాలువలు, పూలగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురమ్మని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్ తేవాలని కోరారు. ఆయన విజ్ఞప్తికి అనూహ్య స్పందన వస్తోంది. విజ్ఞప్తి చేసిన కొద్ది సమయంలోనే వేల పుస్తకాలు జమ అయ్యాయి. ఇందుకు వారందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలు మళ్లీ తెరిచాక వీటిని విద్యార్థులందరికీ పంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు.

Related Tags