‘పుష్ప’పై ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.

'పుష్ప'పై ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనా..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 2:50 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక ఎంపికైంది. కాగా ఈ మూవీలో మరో హీరోయిన్ ఉండబోతుందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. టాలెంటెడ్ బ్యూటీ నివేథా థామస్‌ ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో కనిపించబోతుందని పుకార్లు వచ్చాయి. అంతేకాదు రష్మిక పాత్ర కంటే నివేథా పాత్రనే ఎక్కువ ఉండబోతున్నట్లు టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం అవన్నీ వట్టి పుకార్లేనని తెలుస్తోంది.

ఇందులో రష్మిక మాత్రమే హీరోయిన్ అని, మరో హీరోయిన్‌ లేదని మూవీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఈ మూవీలో రష్మిక పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ-సుకుమార్ కాంబోలో మూడో చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story also: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: వీడియో కాల్‌లో తల్లి అంత్యక్రియలు చూసిన ప్రముఖ హీరో..!