లడాఖ్ లో భారత దళాలను తగ్గించం, ప్రభుత్వ స్పష్టీకరణ

లడాఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా తమ సైనిక దళాలను తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చైనాకు గట్టి సందేశం ఇచ్చింది. అక్కడ మోహరించిన ట్రూప్స్ ను కుదించబోమని స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ లో..

లడాఖ్ లో భారత దళాలను తగ్గించం, ప్రభుత్వ స్పష్టీకరణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 7:46 PM

లడాఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా తమ సైనిక దళాలను తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చైనాకు గట్టి సందేశం ఇచ్చింది. అక్కడ మోహరించిన ట్రూప్స్ ను కుదించబోమని స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ లో పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం. నరవాణే తో బాటు నేవీ, వైమానిక దళ చీఫ్ లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని పరిస్థితిని, చైనా దళాల ఉనికిని గురించి ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించారు.

సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత,చైనా దేశాలు దౌత్య స్థాయిలో చర్చలు జరిపిన రెండు రోజుల అనంతరం ఈ ఈ మీటింగ్ జరిగింది. మొత్తం మీద లడాఖ్ లో పరిస్థితి యథాతథంగానే ఉందని, నివురు గప్పిన నిప్పులా ఉందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.