మోదీ కేబినెట్‌లో.. అపర చాణక్యుడికి మొండి చెయ్యి.?

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార పగ్గాలను చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. ఎన్నికల్లో సదా మోదీ వెన్నంటే ఉన్న అపర చాణక్యుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరిస్థితి ఇప్పుడేంటి అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ కొత్త కేబినెట్‌లో ఈయనకు స్థానం లభిస్తుందా అన్నది ప్రధాన అజెండాగా మారింది.

ఇది ఇలా ఉంటే మొన్నటిదాకా పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన అమిత్ షా.. ఈ ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. దీనితో కొత్తగా కొలువుదీరబోయే మోదీ కేబినెట్‌లో అమిత్ షా‌కు కీలక శాఖ దక్కుతుందని అందరూ భావించారు. హోమ్, రక్షణ, ఆర్ధిక.. ఇలా పలు శాఖల్లో ఏదో ఒక దానిని ఆయనకు అప్పగిస్తారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అమిత్ షా‌కు మోదీ నయా కేబినెట్‌లో చోటు దక్కడం లేదని అంటున్నారు. ఈసారి కూడా అమిత్ షా‌ను తన కేబినెట్‌లోకి తీసుకోకపోవడంలో నరేంద్ర మోదీ ఆంతర్యం ఏమిటో తెలియదు గానీ.. ఆయనకుకు మొండి చెయ్యి ఇచ్చి పార్టీలో ఇదివరకు మాదిరే క్రీయాశీలక పాత్ర కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఘన విజయం దిశగా నడిపించడానికి అమిత్ షా చేసిన కృషి, ఆయన పట్టుదలను మోదీ విస్మరించలేదు. ఈ నేపథ్యంలో తనకు కుడి భుజంగా ఉన్న ఈయనకు కేబినెట్ మంత్రిగా కన్నా పార్టీలో అత్యున్నత స్థాయిని కల్పించాలన్నదే మోదీ లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *