కేసీఆర్ షాకింగ్ డెసిషన్.. ఇకపై బాటిల్స్‌లో పెట్రోల్ బంద్!

సాధారణంగా మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుని.. నిల్వ ఉంచుకోవడానికి బాటిల్స్‌లో కూడా పెట్రోల్ పోయించుకుంటాం. ఈ మధ్యకాలంలో ఇదే ధోరణి ఎక్కువగా ఉంది. ఇక మధ్యలో బండి ఆగిపోతే.. పక్కనే ఉన్న బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకుని వస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ పద్దతికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బాటిల్స్‌లో పెట్రోల్ సేల్స్ బంద్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని […]

  • Ravi Kiran
  • Publish Date - 3:03 pm, Tue, 12 November 19
కేసీఆర్ షాకింగ్ డెసిషన్.. ఇకపై బాటిల్స్‌లో పెట్రోల్ బంద్!

సాధారణంగా మనం బండిలో పెట్రోల్ కొట్టించుకుని.. నిల్వ ఉంచుకోవడానికి బాటిల్స్‌లో కూడా పెట్రోల్ పోయించుకుంటాం. ఈ మధ్యకాలంలో ఇదే ధోరణి ఎక్కువగా ఉంది. ఇక మధ్యలో బండి ఆగిపోతే.. పక్కనే ఉన్న బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకుని వస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ పద్దతికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బాటిల్స్‌లో పెట్రోల్ సేల్స్ బంద్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్‌గా హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేష్ అనే నిందితుడు.. ఆమె ఆఫీస్‌‌కి బాటిల్ పెట్రోల్ తీసుకెళ్లి నిప్పంటించి.. సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండానే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాహనాల్లో తప్పితే.. ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఇకపై పెట్రోల్ పోయించుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక బోర్డులు కొన్ని పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్నాయి.