Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

పార్టీ మారేది లేదు టీవీ9తో సాధినేని యామిని

No party change says TDP spokes person Sadineni Yamini, పార్టీ మారేది లేదు టీవీ9తో సాధినేని యామిని

తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్‌ సాధినేని యామిని. తన పదునైన మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఆమె అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీపై మాటలు సంధించారు. ఆమె గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నికి చెక్ పెడుతూ ఆమె టీవీ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆస్తక్తికర అంశాలను ప్రస్తవించారు. తాను ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అఖండమైన మెజారిటీతో గెలిచినందున ఆయా పార్టీలు అనుసరించే విధానాలను అర్ధం చేసుకోడానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నారు యామిని. అందుకే తాను మూడు నెలలపాటు మౌనంగా ఉన్నట్టు తెలిపారు. అయితే తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిఒక్కరికి సమాజంపై బాధ్యత ఉంటుందని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తారని.. తాను కూడా అలాగే వచ్చానని తెలిపారు.

ఇంతకాలం మౌనం తర్వాత తమ పార్టీ అధినేత చంద్రబాబును ఆదేశాలు అందుకున్నట్టుగా చెప్పారు. ప్రతి రాజకీయపార్టీలోనూ చిన్నచిన్న సమస్యలనేవి ఉంటాయని వాటిని అధిగమించాలి తప్ప తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నట్టు చెప్పారు. తాను పార్టీ మాత్రం మారే పరిస్థితి లేదన్నారు యామిని.

సాధినేని యామిని టీడీపీ మహిళా విభాగంలో పార్టీకి సేవలందించారు. గత ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రతిపక్షపార్టీని విమర్శించడంలో తనదైన ముద్రను వేసుకున్నారు యామిని. అయితే ఆమె గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండటంతో పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. తాజా ఇంటర్వ్యూలో అవన్నీకట్టుకథలంటూ తేల్చిపారేశారు.