తిరుమలలో అన్యమతప్రచారమా? ఆ దమ్మెవడికుంది?

తిరుమలలో అన్యమత ప్రచారంపై దశాబ్దాలుగా రచ్చ రగులుతూనే వుంది. కానీ, ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటై తర్వాత ఈ రచ్చ మరింతగా పెరిగిపోయింది. బస్సు టిక్కెట్లతో మొదలైన అన్యమత ప్రచారం రగడ… ప్రతీ వారం ఏదో ఒక రూపంలో వివాదామవుతూనే వుంది. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తిరుమలలో వున్నది కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ముందు అన్యమత ప్రచారం […]

తిరుమలలో అన్యమతప్రచారమా? ఆ దమ్మెవడికుంది?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 7:14 PM

తిరుమలలో అన్యమత ప్రచారంపై దశాబ్దాలుగా రచ్చ రగులుతూనే వుంది. కానీ, ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటై తర్వాత ఈ రచ్చ మరింతగా పెరిగిపోయింది. బస్సు టిక్కెట్లతో మొదలైన అన్యమత ప్రచారం రగడ… ప్రతీ వారం ఏదో ఒక రూపంలో వివాదామవుతూనే వుంది. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘తిరుమలలో వున్నది కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన ముందు అన్యమత ప్రచారం చేసే దమ్ము, ధైర్యం ఎవడికీ లేదు‘‘ ఇవి వైవీ సుబ్బారెడ్డి తాజా వ్యాఖ్యలు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, దాన్ని ఎవరూ ప్రోత్సహించలేదని సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం అన్నది కేవలం కొందరి దుష్ప్రచారం మాత్రమేనని ఆయనంటున్నారు. ప్రభుత్వాన్ని, టిటిడి పాలక మండలిని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు చేస్తున్న ప్రయత్నమేనని ఆయనంటున్నారు.

తాను గానీ, టిటిడి పాలక మండలి సభ్యులు, అధికారులు ఎవరు కూడా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించరని, అసలా దమ్మూ, ధైర్యం తమలో ఎవరికీ లేదని సుబ్బారెడ్డి అన్నారు. కలియుగ దైవంతో చెలగాటమాడే సాహసం తమ బోర్డు సభ్యులెవరు చేయరని ఆయన వ్యాఖ్యానించారు.