నో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌’: బీసీసీఐ

భారత క్రికెటర్లు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు.. ఇకపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్ఓసీ) ఇవ్వబోమని పాలక మండలి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాలక మండలిలో చర్చ జరిగిందని, అయితే కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న యువరాజ్‌ సింగ్‌ విషయంలో మాత్రమే మినహాయింపు ఇచ్చారని ఓ అధికారి పేర్కొన్నారు. జరిగిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఇకపై ఏ ఆటగాడికీ ఎన్‌ఓసీ ఇవ్వబోమని ఆయన వివరించారు.వివరించారు. ఈ విషయంపై నిలకడతత్వం ఉండాలని, […]

నో 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌': బీసీసీఐ
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 6:06 PM

భారత క్రికెటర్లు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు.. ఇకపై నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్ఓసీ) ఇవ్వబోమని పాలక మండలి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాలక మండలిలో చర్చ జరిగిందని, అయితే కెనడా గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్న యువరాజ్‌ సింగ్‌ విషయంలో మాత్రమే మినహాయింపు ఇచ్చారని ఓ అధికారి పేర్కొన్నారు. జరిగిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఇకపై ఏ ఆటగాడికీ ఎన్‌ఓసీ ఇవ్వబోమని ఆయన వివరించారు.వివరించారు.

ఈ విషయంపై నిలకడతత్వం ఉండాలని, కానీ ప్రస్తుత పాలక మండలిలో ఆ స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల కెరీర్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మరోవైపు టీమ్‌ఇండియాలో రిటైర్మెంట్‌ గురించి ఆలోచించే కొందరు టీ20లీగ్‌లలో ఆడాలనుకుంటున్నారని, మరికొందరు మాజీలు కూడా అందుకు సిద్ధంగా ఉండే అవకాశముందని అన్నారు. పాలకుల కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం వారి ఆశలపై నీళ్ల చల్లడమేనన్నారు. ఇంకో అధికారి మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా జరగదని.. ఏదైనా దేశం మాజీ ఆటగాళ్లకు టీ20లీగ్‌లలో ఆడే అవకాశం కల్పిస్తే.. అది ఐసీసీ సమస్య అవుతుందని చెప్పుకొచ్చారు.