Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త… ఆ చార్జీల ఎత్తివేత!

No NEFT charges for savings account holders from Jan 2020, బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త… ఆ చార్జీల ఎత్తివేత!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారి నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) చార్జీలను వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్ లావాదేవీలకు బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఇకపై బ్యాంకుకు వెళ్లి ఇతరులకు నెఫ్ట్ రూపంలో డబ్బు పంపాలన్నా ఎలాంటి చార్జీలు పడవు.

‘డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము వసూలు చేసే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగించాలని నిర్ణయించాం. దీంతో బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలి. ఒక వారంలోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయి’ అని ఆర్‌బీఐ తెలిపింది. పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ఆర్‌టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య డబ్బులు పంపేందుకు ఈ విధానాన్ని వాడతారు. ఇక నెఫ్ట్ మార్గంలో రూ.2 లక్షల వరకు లావాదేవీలను నిర్వహించొచ్చు. ఆర్‌బీఐ ఇంకా నెఫ్ట్ సర్వీసులు రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 2019 డిసెంబర్ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఇప్పుడు నెఫ్ట్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.