‘ఎగ్జిట్‌ పోల్స్‌’పై ఎందుకంత హైరానా..?

ఎగ్జిగ్ పోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత వర్ల రామయ్య. అవి నిజం కావచ్చని లేదా అబద్ధం కావచ్చని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ తీరు రాజ్యంగ విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఈసీ క్లీన్ చీట్ ఇవ్వడం వివక్షతకు పరాకాష్ట అని విమర్శించారు. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసానే తమ మాటకు […]

'ఎగ్జిట్‌ పోల్స్‌'పై ఎందుకంత హైరానా..?
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 4:20 PM

ఎగ్జిగ్ పోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత వర్ల రామయ్య. అవి నిజం కావచ్చని లేదా అబద్ధం కావచ్చని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ తీరు రాజ్యంగ విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఈసీ క్లీన్ చీట్ ఇవ్వడం వివక్షతకు పరాకాష్ట అని విమర్శించారు. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసానే తమ మాటకు విలువ లేదని తెలపడం.. మోదీ నిరంకుశ పాలనకు అద్దం లాంటిదన్నారు. ఈసీని వెంటనే ప్రక్షాళన చేయాలని యనమల, వర్లరామయ్య కోరారు.