మరాఠా కోటాకు సుప్రీంకోర్టు తిరస్కృతి , విస్తృత ధర్మాసనానికి నివేదన

మహారాష్ట్రలో కాలేజీ అడ్మిషన్లకో, లేదా ఉద్యోగాలకో మరాఠా  రిజర్వేషన్ కోటా అంటూ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా చట్ట బధ్ధతను తేల్చేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సూచించింది.

మరాఠా కోటాకు సుప్రీంకోర్టు తిరస్కృతి , విస్తృత ధర్మాసనానికి నివేదన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 09, 2020 | 4:44 PM

మహారాష్ట్రలో కాలేజీ అడ్మిషన్లకో, లేదా ఉద్యోగాలకో మరాఠా  రిజర్వేషన్ కోటా అంటూ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా చట్ట బధ్ధతను తేల్చేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు ఎల్.నాగేశ్వర రావు, హేమంత్ గుప్తా, ఎస్.రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన  మరాఠాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ 16 శాతం ఉండాలంటూ ప్రభుత్వం 2018 లో ఓ చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో బాంబే హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. కానీ కోటా శాతాన్ని 12 కి తగ్గించింది. అయినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సున్నితమైన ఈ అంశంపై  విస్తృత ధర్మాసనమే ఓ నిర్ణయం తీసుకోవాలని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.