జమ్మూ కాశ్మీర్ పై చైనా వ్యాఖ్యలు, భారత్ మండిపాటు

జమ్మూ కాశ్మీర్ విషయంలో చైనా చేసిన వ్యాఖ్యలపట్ల భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. మీ సూచన చట్టవిరుధ్దమని, చెల్లుబాటు కాని కామెంట్ అని పేర్కొంది.  అసలు మా దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు.

జమ్మూ కాశ్మీర్ పై చైనా వ్యాఖ్యలు, భారత్ మండిపాటు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 06, 2020 | 1:21 PM

జమ్మూ కాశ్మీర్ విషయంలో చైనా చేసిన వ్యాఖ్యలపట్ల భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. మీ సూచన చట్టవిరుధ్దమని, చెల్లుబాటు కాని కామెంట్ అని పేర్కొంది.  అసలు మా దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. కాశ్మీర్ లో యధాతథ పరిస్థితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నమైనా ఇల్లీగల్, ఇన్ వాలిడ్ అని చైనా విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసి, ఈ  రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ గత ఏడాది ఆగస్టు 5 న నిర్ణయం తీసుకుంది. నిన్నటితో ఇందుకు  ఏడాది పూర్తయిన సందర్భంగా పాకిస్థాన్ కి చెందిన  ఓ జర్నలిస్ట్…. చైనా ప్రతినిధిని ఈ విషయమై ‘కెలికాడు’ దీంతో ఆయన ఇదే సందనుకుని.. కాశ్మీర్  విషయాన్ని ప్రస్తావించాడు.