Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజునుప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

ఐపీఎల్‌కు కరోనా బీమా వర్తించదట..!

ప్రపంచ క్రీడా రంగం కుదేలైన నేపథ్యంలో..ఐపీఎల్‌కు కొవిడ్‌ బీమా కల్పించాలని పాలక మండలి, బీసీసీఐ, ఫ్రాంచైజీలు, ప్రసారకర్త స్టార్‌ ఇండియా భావించాయి

IPL Does Not Have Corona Insurance, ఐపీఎల్‌కు కరోనా బీమా వర్తించదట..!

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగం మొత్తం కుదేలైంది. మహమ్మరి ఉగ్రరూపానికి క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, రగ్బీ తదితర క్రీడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. క్రీడాకారులకు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మార్చిలో ప్రారంభమైన ఈ పరిస్థితి ఆగస్టుకు వచ్చే సరికి కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతోంది. నిలిచి పోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, ఫార్మూలావన్ తదితర క్రీడలు తిరిగి ప్రారభమవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌వెస్టిండీస్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ మళ్ల ప్రారంభమైంది. ఇక యుఎఇ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్ జరుగనుంది. దీని కోసం ఇప్పటికే ఆయా జట్ల క్రికెటర్లు యుఎఇ చేరుకున్నారు. దీంతో దేశంలో క్రికెట్ సందడి ప్రారంభమైంది.

ప్రపంచ క్రీడా రంగం కుదేలైన నేపథ్యంలో..ఐపీఎల్‌కు కొవిడ్‌ బీమా కల్పించాలని పాలక మండలి, బీసీసీఐ, ఫ్రాంచైజీలు, ప్రసారకర్త స్టార్‌ ఇండియా భావించాయి. కానీ, ప్రస్తుత తరుణంలో ఐపీఎల్‌కు బీమా సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని భీమా కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రపంచ క్రీడా రంగంలో ‘వైరస్‌’ తరహా బీమాను వింబుల్డన్‌ నిర్వాహకులు మాత్రమే చేయించారు. అదికూడా 2003లో సార్స్‌ ప్రబలినప్పటినుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిర్వాహకులు ఏటా ఈ తరహా పాలసీ తీసుకుంటున్నారు. కాగా, కొవిడ్‌తో 2020 వింబుల్డన్‌ రద్దుకాగా..నిర్వాహకులకు రూ. 1042 కోట్లు బీమాగా లభించింది. అయితే, దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌కు సైతం బీసీసీఐ, ఫ్రాంచైజీలు రెండు పెద్ద బీమా పాలసీలు తీసుకున్నాయి. టోర్నీ రద్దుకు సంబంధించి బీసీసీఐ చేసిన బీమా మొదటిది. రెండో దానిని ఆటగాళ్లు రెమ్యునరేషన్‌ నష్టపోతే చెల్లించే పాలసీని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. అయితే, ఈ రెండు పాలసీలు కొవిడ్‌ కిందకు రావని ప్రముఖ బీమా సంస్థ ఒకటి తేల్చి చెప్పింది. కరోనా ఇప్పటికీ కొనసాగుతున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఆ వైర్‌సకు సంబంధించి క్రీడా బీమా పాలసీలే లేవని వెల్లడించింది. దీంతో ఖంగుతిన్న బీసీసీఐ, ఫ్రాంచైజీలు తలలుపట్టుకుంటున్నాయి. ఇతర క్రీడాలకు కల్పించిన భీమా క్రికెట్ కు కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు.

Related Tags