మాది బ్రదర్స్ సెంటిమెంట్.. హార్దిక్‌పై కృనాల్ కామెంట్స్!

No insecurity, we enjoy each other's success: Krunal Pandya on Hardik

తన తమ్ముడు హార్దిక్ పాండ్యతో తనను ఎప్పుడూ పోల్చుకోలేదని భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తెలిపాడు. ‘మా ఇద్దరి ఆలోచనా విధానాలు వేరైనా.. దేశాన్ని గర్వపడేలా చేయడమే మా ప్రధాన లక్ష్యమని అన్నాడు. హార్దిక్ విజయాలు చూసి తాను అసూయపడనని.. అతడి నీడలో తాను లేనని కృనాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున ఆడుతున్న కృనాల్.. త్వరలోనే మూడో ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన కల అని కృ‌నాల్ పాండ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *