మీరు మాంసాహారులా..? ఐతే మీరు ఆ విషయంలో లక్కీ..

వెజిటేరియన్స్.. నాన్ వెజిటేరియన్స్… ఈరెండు గ్రూపుల్లో ఎవరికి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ఎక్కువ? అనే ప్రశ్నకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధనలో ఊహించని నిజాలు వెల్లడయ్యాయి. పదికాలాలపాటు ఆరోగ్యంగా జీవించాలకుంటే కాయగూరలు, ఆకు కూరలు, చిరుధాన్యాలతోనే సాధ్యమనే విధంగా ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం జరుగుతోంది. అయితే వీటిని ఆహారంగా భుజించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు, ఆనారోగ్య సమస్యలు దరి చేరవనే విధంగా చెప్పుకొస్తున్నారు. మరి మాంసాహారుల సంగతి ఏంటీ అనే ప్రశ్న కూడా తలెత్తుంది. మాంసాహారాన్ని ఆహరంగా […]

మీరు మాంసాహారులా..? ఐతే మీరు ఆ విషయంలో లక్కీ..
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 5:05 PM

వెజిటేరియన్స్.. నాన్ వెజిటేరియన్స్… ఈరెండు గ్రూపుల్లో ఎవరికి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు ఎక్కువ? అనే ప్రశ్నకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధనలో ఊహించని నిజాలు వెల్లడయ్యాయి. పదికాలాలపాటు ఆరోగ్యంగా జీవించాలకుంటే కాయగూరలు, ఆకు కూరలు, చిరుధాన్యాలతోనే సాధ్యమనే విధంగా ప్రస్తుతం విస్తృతంగా ప్రాచుర్యం జరుగుతోంది. అయితే వీటిని ఆహారంగా భుజించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు, ఆనారోగ్య సమస్యలు దరి చేరవనే విధంగా చెప్పుకొస్తున్నారు. మరి మాంసాహారుల సంగతి ఏంటీ అనే ప్రశ్న కూడా తలెత్తుంది. మాంసాహారాన్ని ఆహరంగా భుజించే వారికంటే శాఖాహారాన్ని తీసుకునే వారి ఆరోగ్యమే నిలకడగా ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. అయితే ప్రపంచ ప్రఖ్యాత  ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జరిగిపిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

శాఖాహారులకంటే.. మాంసాహారుల్లేనే బ్రెయిన్ స్ట్రోక్ ( తలలో రక్త నాళాలు చిట్లిపోవడం) వచ్చే అవకాశాలు చాల తక్కువగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఇంకా చెప్పాలంటే వెజిటేరియన్స్‌లోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 20 శాతం అధికంగా నిర్ధారించారు. ఇది నిజంగా విస్తుగొలిపే అంశమే. మాంసాహారాన్ని అధికంగా తినే వారిలో కంటే శాకాహారుల మెదడులో ఉన్న రక్తనాళాల నుంచి తక్కువ కొలెస్ట్రాల్, బీ 12 వంటివి తక్కువగా ప్రవహించడం వల్ల రక్త నాళాలు పగిలిపోయే ఛాన్స్ అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ లెక్కన చూస్తూ మాంసాహారుల రక్త నాళాలకు బలంగా ఉంటూ..దాని గుండా ప్రవహించే కొలెస్ట్రాల్, బీ 12 అనేవి ఎక్కువగా ప్రయాణించడంతో స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కవగా ఉన్నట్టు తేలింది. ఎంతోమంది బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంచం పడుతూ చికిత్సకు వెనుకాడుతున్న తరుణంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 18 సంవత్సరాల సుధీర్ఘ కాలం పాటు అధ్యయనం చేశారు. దాదాపు 4 వేలమందిపై అధ్యయనం చేయగా అందులో 2,820 మంది హార్ట్ అటాక్‌లతోనూ, 1,072 మంది బ్రెయిన్ స్ట్రోక్స్‌తో మంచాన పడినట్టు గుర్తించారు. దీనికి గల ప్రధాన కారణం ఆహారం వినియోగమేనని తేల్చారు. బ్రెయిన్ స్ట్రోక్ కంటే హార్ట్ ఎటాక్‌తో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తేల్చారు.

అయితే ఈ రెండు అనారోగ్య సమస్యల్లో గుండెపోటుతోనే అధిక మరణాలు సంభవిస్తున్నందున.. శాకాహారమే మేలని కూడా తేల్చారు. మొత్తానికి బ్రెయిస్ స్ట్రోక్ నుంచి రక్షించుకోవాలంటే నాన్ వెజ్, హార్ట్ ఎటాక్ నుంచి రక్షించుకోవాలంటే వెజ్ తింటే మంచిదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!