Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

హెల్మెట్ పెట్టుకోకపోతే టూవీలర్ సీజ్!

No helmet? Now lose your vehicle: Strict action against violators recommended by HC, హెల్మెట్ పెట్టుకోకపోతే టూవీలర్ సీజ్!

బైక్ లేదా స్కూటర్ నడిపేవారు ఖ‌చ్చితంగా హెల్మెట్ పెట్టుకోవలసిందే. అలాగే టూవీలర్ వెనక భాగంలో కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది. అయితే హెల్మెట్ రూల్స్‌ను అందరు ఖ‌చ్చితంగా పాటించడం లేదు. అందుకే ఇటీవల కాలంలో హెల్మెట్ రూల్స్ కఠినతరమౌతున్నాయి.

హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వారి టూవీలర్‌ను స్వాధీనం చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తాజాగా సంబంధిత అధికారులను ఆదేశించింది. వాహనం నడిపే వ్యక్తితోపాటు, వెనుక భాగంలో కూర్చున వారికి కూడా హెల్మెట్ తప్పనిసరని పేర్కొంది. బెంగళూరు వంటి నగరంలో ఈ రూల్ ఇప్పటికే అమలులో ఉన్నా కూడా చెన్నైలో ఎందుకు ఈ నిబంధనను అమలు చేయడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

హెల్మెట్ నిబంధనను అతిక్రమించిన వారికి భారీగా పెనాల్టీ విధించాలని ఆదేశించింది. వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ పెట్టుకోకపోతే వారి వెహికల్‌‌ను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. వాహనదారులు కొత్త హెల్మెట్, దాని బిల్లు చూపించిన తర్వాత వాహనాన్ని తిరిగి అప్పగించాలని పేర్కొంది.

Related Tags