అక్కడ గత మూడు నెలల్లో ఒక్క ఆడశిశువు జన్మించలేదట?

కేంద్రం తన “బేటి బచావో బేటి పఢావో” కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న సమయంలో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గత మూడు నెలలుగా ఒక్క ఆడశిశువు కూడా జన్మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 132 గ్రామాల్లో అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం గత మూడు నెలల శిశు జనన నమోదు జాబితాలో ఒక్క ఆడశిశువు కూడా పుట్టలేదని తేలింది. జిల్లా కలెక్టర్‌ ఆశిశ్‌ చౌహాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 132 గ్రామాల్లో మూడు నెలలుగా తాము సేకరించిన సమాచారం […]

అక్కడ గత మూడు నెలల్లో ఒక్క ఆడశిశువు జన్మించలేదట?
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 2:31 AM

కేంద్రం తన “బేటి బచావో బేటి పఢావో” కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న సమయంలో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో గత మూడు నెలలుగా ఒక్క ఆడశిశువు కూడా జన్మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 132 గ్రామాల్లో అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం గత మూడు నెలల శిశు జనన నమోదు జాబితాలో ఒక్క ఆడశిశువు కూడా పుట్టలేదని తేలింది.

జిల్లా కలెక్టర్‌ ఆశిశ్‌ చౌహాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 132 గ్రామాల్లో మూడు నెలలుగా తాము సేకరించిన సమాచారం ప్రకారం ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదని తేలిందని అన్నారు. గత మూడు నెలల్లో 216 మంది చిన్నారులు జన్మించగా వారిలో ఒక్క నవజాత ఆడ శిశువు కూడా లేదని పేర్కొన్నారు. ఆడ శిశువుల సంఖ్య ఇంతగా దిగజారిపోవడానికి కారణాలపై ఆయా ప్రాంతాల్లో ఆరా తీస్తున్నామని వెల్లడించారు. దీని వెనక కారణాలు తెలుసుకునేందుకు ఆశా కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించి ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షించమని ఆదేశించారు.