ఎవరి కుమారుడైనా సరే వదలకండి: మోదీ

‘‘తప్పుచేస్తే ఎవరి కుమారుడైనా సరే వదలకండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ని ఇండోర్‌లో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా బ్యాట్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పందించిన మోదీ.. ఇంతవరకు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని సూచించారు. దీనిపై సమావేశమనంతరం బీజేపీ నేత రాజీవ్ […]

ఎవరి కుమారుడైనా సరే వదలకండి: మోదీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 02, 2019 | 5:19 PM

‘‘తప్పుచేస్తే ఎవరి కుమారుడైనా సరే వదలకండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ని ఇండోర్‌లో మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా బ్యాట్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పందించిన మోదీ.. ఇంతవరకు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని సూచించారు.

దీనిపై సమావేశమనంతరం బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. ‘‘మధ్యప్రదేశ్ సంఘటనపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలతో తప్పుగా వ్యవహరించడం, వారిపై కోపాన్ని చూపే అధికారం ఎవరికీ లేదని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై అస్సలు ఉపేక్షించిలేదని ఆయన చెప్పారు’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా జైలు నుంచి బయటికి వచ్చాక ఆకాష్‌కు స్వాగతం పలికిన నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.

అయితే బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్గియా కుమారుడైన ఆకాష్.. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఆఫీసర్‌పై దాడి చేసి.. ఆ కేసులో జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. కాగా మోదీ మాటలను బట్టి చూస్తుంటే.. ఆకాష్‌పై త్వరలోనే వేటు పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 380మంది బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. పార్టీ సీనియర్లైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.