నో డౌట్, యుఎస్ ఎలెక్షన్ లో ఫ్రాడ్ జరగలేదు, అటార్నీ జనరల్, మారని ట్రంప్ ట్రెండ్ !

అయితే ట్రంప్ ప్రచారవర్గం మాత్రం ఇప్పటికీ ఈ ఎన్నిక ఫ్రాడ్ అనే అంటోంది. కనీసం 6 రాష్ట్రాల్లో ఇల్లీగల్ ఓటింగ్ జరిగిందని, వీటిని పరిశీలకులు పరీక్షించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఫ్రాడ్ జరిగినట్టు తాము కళ్ళతో చూశామని..

నో డౌట్, యుఎస్ ఎలెక్షన్ లో ఫ్రాడ్ జరగలేదు, అటార్నీ జనరల్, మారని ట్రంప్ ట్రెండ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2020 | 2:50 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందన్న రిపబ్లికన్ల ఆరోపణను అటార్నీ జనరల్ బిల్ బార్ తోసిపుచ్చారు.  ఇప్పటివరకు ఈ ఎన్నికలో మరో ఫలితం వచ్చిందనడానికి ఎలాంటి ఆధారం లభించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా చరిత్రలో ఈ ఎన్నిక ఎంతో సజావుగా జరిగిందని ఇండిపెండెంట్ ఎన్నికల పరిశీలకులు, హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్, యుఎస్ ఇంటెలిజెన్స్ అబ్జర్వర్లు తేల్చిన నిర్ధారణను బార్ వ్యాఖ్యలు ధృవీకరించాయి. సాక్షాత్తూ ట్రంప్ సహచరుడని పేరున్న బిల్ బారే ఆయన ఆరోపణను తిరస్కరించడం విశేషం. ఒకవేళ ఎన్నిక మోసపూరితంగా జరిగితే అది ఓట్ల గల్లంతులో తేలుతుందన్నారు. పైగా హోం లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్, జస్టిస్ విభాగాల ప్రకటనలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

అయితే ట్రంప్ ప్రచారవర్గం మాత్రం ఇప్పటికీ ఈ ఎన్నిక ఫ్రాడ్ అనే అంటోంది. కనీసం 6 రాష్ట్రాల్లో ఇల్లీగల్ ఓటింగ్ జరిగిందని, వీటిని పరిశీలకులు పరీక్షించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఫ్రాడ్ జరిగినట్టు తాము కళ్ళతో చూశామని చెబుతున్న సాక్షులు ఎంతమందో ఉన్నారని ఈ వర్గం అంటోంది. ఇక ట్రంప్..లక్షలాది ఫేక్ బ్యాలెట్లు ఓటింగ్ కేంద్రానికి చేరడాన్ని తాను గమనించానని అంటూ ..’టెరిబుల్’…. సేవ్ అమెరికా అని ట్వీట్ చేశారు. ఇంతమంది పోలింగ్ సిబ్బందిని తాము ఎప్పుడూ చూడలేదన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం..అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కు ట్రంప్ తో పోలిస్తే 60 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు 270 మార్క్ ని మించి 306 ఓట్లు లభించాయి. ట్రంప్ ఎంత మంకుపట్టు పడుతున్నా బైడెన్  మాత్రం తాను కోర్టుల్లో దావా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. ఫలితం క్లియర్ గా ఉన్నప్పుడు ఇక దావాలు వేసినా అందులో అర్థం ఉంటుందా అన్నది ఆయన వ్యాఖ్య !