అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్..!

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం చేధువార్త తెలిపింది. ప్రస్తుతం కరోనా ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో.. పినరయ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకు చెక్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి శబరిమల ఆలయంలో 10 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలకు భక్తులకు అనుమతించేది లేదని స్పష్ట చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు. […]

అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్..!
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 5:11 PM

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం చేధువార్త తెలిపింది. ప్రస్తుతం కరోనా ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉండటంతో.. పినరయ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకు చెక్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి శబరిమల ఆలయంలో 10 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలకు భక్తులకు అనుమతించేది లేదని స్పష్ట చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు. అటు గురువాయూర్‌లోని శ్రీకృష్ణ మందిర్‌ కూడా మూసివేసినట్లు అక్కడి అధికారులు వెల్డడించారు. అయితే శబరిమల, గురువాయూర్ ఆలయాల్లో కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే నిలిపివేస్తున్నామని.. సంప్రదాయ ప్రకారం జరగాల్సిన అన్ని పూజలు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

కాగా.. ప్రస్తుతం కేరళలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. దీంతో అక్కడి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల్లో ప్రత్యేక  అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది.