Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • నిజామాబాద్ : జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరెండెంట్ డా.నాగేశ్వర్ రావు రాజినామా. వరుస ఘటనలతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వాట్సాప్ మెసేజ్ పంపిన సూపరెండెంట్ . రాజీనామా విషయాన్ని కలెక్టర్ మరియు డీఎంఈ కి తెలియజేశాను . ఎవరు వచ్చిన వారికి పూర్తిగా సహకరిస్తాను . కోద్ధి రోజులుగా వరుస సంఘటనలు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జిల్లా ఆస్పత్రి లో ఆక్సిజన్ లేక నలుగురు చనిపోవడం . కరోనా పేషంట్ ను ఆటోలో తరలించడం.
  • ఆన్ లైన్ క్లాస్ ల నిర్వహణ రద్దు చేయాలని ధాఖలు చేసిన పిటీషన్ పై నేడు హైకోర్టు విచారణ. గత విచారణ ఆన్ క్లాస్ లపై ప్రభుత్వం సమగ్ర నివేధిక అందించాలని ఆదేశించిన హైకోర్టు. నేడు ఆన్ లైన్ క్లాస్ లపై నివేదిక సమర్పించనున్న ప్రభుత్వం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, సీబిఎస్ఈ లను ప్రతివాదులుగా చేర్చిన పిటీషనర్. కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ వాదనలు విననున్న హైకోర్టు. ఆన్ లైన్ క్లాస్ లపై నేడు కీలక తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.
  • హైద్రాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత జి.నరేందర్ యాదవ్ కారోనాతో మృతి. ఇటీవలే కారోనా భారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న నరేందర్ యాదవ్. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇటీవల గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న నరేందర్.
  • లష్కరే తోయబా టాప్ టెర్రరిస్ట్ ఉస్మాన్ ను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
  • సీఎం కెసిఆర్: ఇరిగేషన్ శాఖ పై రివ్యూ నిర్వహించిన సీఎం కేసీఆర్. కమలాపూర్ జడ్పిటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ రెడ్డి లను ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి. తెలంగాణలో చెరువులు చెక్డ్యాంలు ఎప్పుడూ నిండి ఉండాలి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు లో ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలి.

పోస్టు ఊడక ముందే ప్రమోషన్.. వావ్ ఉత్తమ్ !

uttam kumar to get promotion, పోస్టు ఊడక ముందే ప్రమోషన్.. వావ్ ఉత్తమ్ !

ఏడాది కాలంగా వరుస ఓటములతో అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న పదవి ఊడక ముందే కొత్త పదవి దక్కి ప్రమోషన్ బాట పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్ళీ లోక్‌సభ బరిలో నిలిచి అక్కడా గెలిచి.. చివరికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాల అమలును వేగవంతం చేసినట్లు సమాచారం.

2015 నుంచి నాలుగేళ్ళుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, 2019 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓటమి, 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సతీమణి పద్మావతి ఓటమి.. ఇలా పీసీసీ అధ్యక్షునిగా చేదు ఫలితాలే దక్కాయి. దాంతో టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్‌ని తప్పించడం కన్‌ఫర్మ్ అనుకున్నారంతా. అందుకు డిసెంబర్ నెలే ముహూర్తమని కూడా చాలా మంది రాశారు.

ఇపుడు డిసెంబర్ నెల మూడో వారం నడుస్తోంది. ఇంతవరకు ఉత్తమ్ కుమార్‌ని తప్పిస్తున్నట్లుగా వార్తలేమీ కన్‌ఫర్మ్ కాలేదు. అదే సమయంలో ఉత్తమ్ గురించి మరోవార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఎంపీగా ఢిల్లీలోనే ఎక్కువగా వుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అక్కడ తన ప్రమోషన్ వర్క్ బాగా చేసుకుంటున్నారట. తన ప్రయత్నాలు కూడా దాదాపు సక్సెస్ బాటలోనే వున్నాయట. దాంతో టీపీసీసీ పదవి వూడక ముందే.. మరో ప్రమోషన్ ఆయనకు దక్కే ఛాన్స్ వుందట.

రాహుల్ గాంధీ త్వరలో మరోసారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో ఏఐసీసీ కమిటీలను పునర్వ్యవస్థీకరించనున్నారు. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని ఆయన అనుచరవర్గం చెప్పుకుంటోంది. అదే జరిగితే అది ఉత్తమ్‌కు ప్రమోషన్‌గానే భావించాలి. సో.. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కాకుండా.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించుకున్నట్లు అవుతుంది.

సో.. పోస్టు ఊడడం కాదు.. ప్రమోషన్ రానుండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్సాహంగా కాంగ్రెస్ పెద్దలతో కలుస్తున్నారని, ఢిల్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని చెప్పుకుంటున్నారు. దీనికి ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన భారత్ బచావో ర్యాలీనే ఉదాహరణ అంటున్నారు ఆయన అనుచరులు.

Related Tags