ఆశ, నిరాశల మధ్య గుర్మీత్ రామ్ రహీం

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కు పెరోల్ మంజూరు చేయాలా, వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. తనకు 42 రోజుల పెరోల్ మంజూరు చేయాలని, వ్యవసాయం చేసుకుంటానని రోహతక్ జైలులో శిక్షఅనుభవిస్తున్న గుర్మీత్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చండీగఢ్ కు సుమారు 250 కి.మీ. దూరంలోని సిర్సాలో గల తన ఆశ్రమంలో గతంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడని, ఓ జర్నలిస్టును […]

ఆశ, నిరాశల మధ్య గుర్మీత్ రామ్ రహీం
Follow us

|

Updated on: Jun 25, 2019 | 5:31 PM

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కు పెరోల్ మంజూరు చేయాలా, వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. తనకు 42 రోజుల పెరోల్ మంజూరు చేయాలని, వ్యవసాయం చేసుకుంటానని రోహతక్ జైలులో శిక్షఅనుభవిస్తున్న గుర్మీత్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చండీగఢ్ కు సుమారు 250 కి.మీ. దూరంలోని సిర్సాలో గల తన ఆశ్రమంలో గతంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడని, ఓ జర్నలిస్టును హత్య చేశాడని అభియోగాలు ఎదుర్కొన్న ఇతనికి 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది.

ఈయనకు పెరోల్ మంజూరులో కొన్ని లీగల్ చిక్కులున్నాయని అందువల్ల దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఖట్టర్ పేర్కొన్నారు. అయితే జైల్లో గుర్మీత్ సత్ప్రవర్తనతో మెలిగాడని, ఈ కారణంగా పెరోల్ ఇవ్వవచ్ఛునని ప్రభుత్వం భావిస్తోంది.. పెరోల్ కోరడమన్నది ఆయన హక్కని మంత్రి అనిల్ విజ్ అన్నారు. వివాదాస్పదుడైన గుర్మీత్ కు ప్రయివేటు సైన్యమంటూ ఉందని, ఆశ్రమంలో ఈయనను అరెస్టు చేసేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులపైన, అధికారులపైన వారు దాడికి పాల్పడ్డారని వచ్చిన వార్తలు లోగడ దేశంలో సంచలనం రేపాయి. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.