Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

మూన్ లాండర్ తో నో కాంటాక్ట్.. అది విఫలమైనట్టే.. ఇక గగన్ యాన్ పై దృష్టి ..

Vikram Moon Lander, మూన్ లాండర్ తో నో కాంటాక్ట్.. అది విఫలమైనట్టే.. ఇక గగన్ యాన్ పై దృష్టి ..

చంద్రయాన్-2 లాండర్ విక్రమ్ ని కాంటాక్ట్ చేయలేకపోయామని ఇస్రో చీఫ్ కె. శివన్ ప్రకటించారు. దాన్ని కాంటాక్ట్ చేయడానికి గల 14 రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసిందని ఆయన చెప్పారు. అయితే చంద్రుని ఉపరితలంపై లాండర్ ఈ నెల 7 న సాఫీగా దిగి
చరిత్ర సృష్టించిందని అన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ బాగా పని చేస్తోందని, ఆర్బిటర్లో ఉన్న ఎనిమిది సాధనాలు చక్కగా వాటి ‘ విధులు అవి నిర్వరిస్తున్నాయని ‘ శివన్ వెల్లడించారు. కానీ లాండర్ తో కమ్యూనికేషన్ తెగిపోవడమే విచారకరమన్నారు. అసలు లాండర్ కు ఏం జరిగింది ? అది తెలుసుకోవడమెలా అన్నదే తమ ప్రధాన కర్తవ్యమన్నారు.
ఇక మా తదుపరి లక్ష్యం గగన్ యాన్ మిషన్ అని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-2 మిషన్ 98 శాతం సక్సెస్ అయింది. ఈ విజయం ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మనం ఘనం అని చాటగలిగాం..టెక్నాలజీకి సంబంధించినంత వరకు దాదాపు పూర్తి విజయం సాధించాం అని శివన్ అన్నారు. వచ్ఛే ఏడాదికి మరో మూన్ మిషన్ పై ఇస్రో దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. అటు-లాండర్ ఆచూకీ కనుగొనేందుకు నాసా యత్నించిన విషయాన్ని ఆయన దాటవేశారు. బహుశా ఇస్రో చెబుతున్న దాన్నే నాసా కూడా మరోరకంగా ప్రకటించి
ఉంటుందని శివన్ భావించినట్టు కనబడుతోంది. లాండర్ తో కాంటాక్ట్ తెగిపోయినప్పటికీ.. చంద్రునికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్బిటర్ ఏడాదిపాటు ‘ శ్రమిస్తూనే ఉంటుంది ‘.

Vikram Moon Lander, మూన్ లాండర్ తో నో కాంటాక్ట్.. అది విఫలమైనట్టే.. ఇక గగన్ యాన్ పై దృష్టి ..